Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలంలో బండారు చందర్రావు ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కరోనా ఐసోలేషన్ కేంద్రం గురించి తెలుసుకుని శుక్రవారం ఐసోలేషన్ కేంద్రాన్ని సందర్శించిన ఆశ్వాపురం హెవివాటర్ ప్లాంట్ ఎంప్లాయిస్ యూనియన్, సీఐటీయూ నాయకులు నాగభూషణం ఐసోలేషన్ కేంద్రం నిర్వహాణకు తనవంతు సహాయంగా వారి మామ ఎడ్లపల్లి శేషగిరి జ్ఞాపకార్ధం రూ.25వేలు ట్రస్టు నిర్వహకులు, సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే రమేష్‌కు చెక్ రూపంలో అందజేశారు. ఈ సందర్భంగా నాగభూషణం మాట్లాడుతూ ప్రజా పోరాలతో పాటు ప్రజలకు విపత్తుకాలంలో సేవచేయటంలో సీపీఐ(ఎం) ఎళ్ళవేళలా ముందు వుంటుందని తెలిపారు. నిస్వార్ధంగా సేవచేయటం ద్వారా కరోనా వ్యాప్తిని తగ్గించటంలో ట్రస్టు చేస్తున్న కృషికి వెలకట్టలేమని అన్నారు. అదేవిధంగా పట్టణానికి చెందిన ప్రముఖ న్యాయవాది, ఐలు నాయకులు యం.వి. ప్రసాదరావు, ఝాన్సీ దంపతుల కుమారుడు హర్హ పుట్టినరోజు సందర్భంగా ఐసోలేషన్ కేంద్రానికి 15 లీటర్ల టీ ప్లాస్కో, హట్ బాక్స్, రేటిమేకర్ మొత్తం రూ.ఆరు వేల విలువైన వస్తువులను పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చావెంకటేశ్వర్లు చేతులమీదుగా ఐసోలేషన్ కేంద్రానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో బీసీఆర్ ట్రస్టు నిర్వహకులు గడ్డం స్వామి, సీఐటీయూ జిల్లా ఉపాధ్యాక్షులు గద్దల శ్రీను, ట్రస్టు సభ్యులు, యం.బీ.నర్సారెడ్డి, కె.బ్రహ్మాచారి, యం.రేణుక, బండారు శరత్ బాబు, బి.వెంకటరెడ్డి, లీలావతి, గంగా, లక్ష్మి,నాగరాజు, ఫిరోజ్, జ్యోతి, రామకృష్ణ పాల్గొన్నారు.