Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిరసన తెలిపిన వైద్యులు
నవతెలంగాణ-మణుగూరు
పైశాచిక దాడుల నుండి డాక్టర్లను కాపాడాలని ఇండియన్ మెడికల్ అసోసియషన్ ఆధ్వర్యంలో దేశ వ్యాప్త పిలుపులో భాగంగా మణుగూరులో డాక్టర్లు నిరసన తెలియజేశారు. శుక్రవారం స్థానిక అంబేద్కర్ సెంటర్లో డాక్టర్లు నోటికి నల్ల బ్యాడ్జీలను ధరించి నిరసన తెలిపారు. అనంతరం ప్రముఖ సినియర్ డాక్టర్లు కోటేశ్వరరావు, డాక్టర్ జయశ్రీ, డాక్టర్ బాలక్రిష్ణ పాల్గొని మాట్లాడుతూ... ఆసుపత్రిలో చికిత్స సమయంలో రోగుల ప్రాణాలు కోల్పోయిన ప్రతి సందర్భంలో సంబంధిత డాక్టర్లును బాధ్యులుగా చేస్తూ జరుగుతున్న పైశాచిక దాడుల నుంచి తమను కాపాడాలని కోరారు. డాక్టర్లు దైవాంస సంభుదులుకారని మేము కూడా మనుషులమే అన్నారు. కోవిడ్ సమయంలో రాత్రి, పగలు అని తేడా లేకుండా తమ ప్రాణాలు లెక్క చేయకుండా సేవ చేస్తే, కరోనాతో బాధితులుకు చికిత్స చేస్తున్న సమయంలో మృతి చెందితే బాధితుల సభ్యులు డాక్టర్లపై దాడి చేస్తున్నారని, ఇది దారుణమన్నారు. కరోనా కాలంలో దేశ వ్యాప్తంగా 700పైగా డాక్టర్లు తమ ప్రాణాలు కోల్పోయరని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా మంది డాక్టర్లు తమ ప్రాణాలను పన్నంగా పెట్టి అనేక మంది బాధితులను కాపాడారన్నారు. అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో నిస్సహాయక స్థితిలో ఎంత ప్రయత్నించిన కొందరి ప్రాణాలు కాపాడలేక పోయమన్నారు. అలాంటి సమయంలో కొంత మంది పైశాచిక దాడులకు పాల్పడడం, ప్రాణాలు తీయడం సరైన చర్య కాదన్నారు. డాక్టర్లకు చట్టబద్ధంగా రక్షణ కల్పించాలని, దాడులు చేసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మధుసూదన్‌రావు, డాక్టర్ రామక్రిష్ణ, డాక్టర్ శేశిధర్, డాక్టర్ వీరాశేఖర్, డాక్టర్ లోకేష్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
భద్రాచలం : భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో శుక్రవారం వైద్యులు నిరసన చేపట్టారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి చికిత్స అందిస్తోన్న డాక్టర్లపై దాడులు జరగడం దారుణమంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడులకు నిరసనగా ఐఎమ్ఏ తలపెట్టిన జాతీయ నిరసనకు సంఘీభావంగా ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. సుమారు 30 నిమిషాల నిరసన అనంతరం వైద్యులు విధులకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.