Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి షేక్ బషీరుద్దీన్
నవతెలంగాణ-ఖమ్మం
ప్రముఖ అథ్లెట్ మిల్కాసింగ్ జీవితం నేటి యువతరానికి ఒక పుస్తకం లాంటిదని, ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి షేక్ బషీరుద్దీన్ అన్నారు. అనారోగ్యంతో మరణించిన మిల్కాసింగ్‌కు డీవైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు. తొలుత బీవీకే జనరల్ మేనేజర్ వై.శ్రీనివాసరావు మిల్కాసింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం డివైఎఫ్లు జిల్లా ఉపాధ్యక్షులు గుమ్మా ముత్తారావు అధ్యక్షతన జరిగిన సభలో షేక్ బషీరుద్దీన్ మాట్లాడుతూ.. ఆసియా గేమ్స్ మరియు కామన్వెల్త్ గేమ్స్ లో మొట్ట మొదటి గోల్డ్ మెడలు మిల్కాసింగ్ మన దేశానికి అందించారని, దేశం విభజన సందర్భంగా తల్లిదండ్రులను కోల్పోయిన ఈ పంజాబీ ఆటగాడు పాకిస్తాన్ ఆటగాళ్ళ అభిమానం కుడా పొంది, ఫ్లయింగ్ సిక్కు గా పిలువబడ్డాడని అన్నారు. అర్జున్ అవార్డు, పద్మశ్రీ అవార్డులు ఆయనను వరించాయని అన్నారు.
ఈ సందర్భంగా యుటీఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ రంజాన్, ప్రముఖ లెక్చరర్ బండారు రమేష్ మాట్లాడుతూ మిల్కాసింగ్‌కు నివాళి అర్పించే కార్యక్రమం నిర్వహించినందుకు డివైఎస్ఐ ని అభినందించారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ నాయకులు రావులపాటి నాగరాజు, యర్రా నాగుల సైదరావు, ఇంటూరి అశోక్, పోలేపల్లి చరణ్య, గిరి, వేముల సాంబ, కూరపాటి శ్రీను, రామకష్ణ, నరేష్, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి నందిపాటి మనోహర్, జిఎంపిఎస్ జిల్లా కార్యదర్శి మేకల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.