Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చినుకు పడితే ఆ రహదారి చిత్తడే
- ఎల్, ఎల్ రహదారి బాగుపడేదెన్నడో...
నవతెలంగాణ-దుమ్ముగూడెం
మండల కేంద్రానికి కూత వేటు దూరం...నిత్యం అంతరాష్ట్రాలకు చెందిన ప్రజలు రాక పోకలు సాగించే ప్రదాన రహదారి... అదే లకీëనగరం టు లకీëపురం రహదారి. ఈ రహదారిని పట్టించుకునే వారే లేరా అంటూ నిత్యం ఆ రహదారి గుండా రాక పోకలు సాగించే ప్రజలు పాలక ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నారు.
మండల కేంద్రానికి కూత వేటు దూరంలో ఉన్న ములకపాడు సెంటర్లో గల రహదారి సుమారు 20 అడుగుల మేర పెద్ద గోతులతో దర్శనమిస్తోంది. ఈ గుంతల రహదారి గుండా రాక పోకలు సాగించాలంటే వాహన దారులు మాములుగానే నానా ఇబ్బంది పడుతున్నారు. ఎల్ ఎల్ రహదారిగా పిలవబడుతున్న ఈ రహదారి సుమారు 24 కిమీ ఉంటుందనే చెప్పవచ్చు. వర్షాకాలం వచ్చిందంటే చాలు ఈ రహదారి గుండా ప్రయాణం చేయాలంటే నరకం అనుభవించాల్సిందే. చినుకు పడితే చాలు రహదారి గోతులలో వర్షపు నీరు చేరి సముద్రాన్ని తలపించడంతో పాటు బురదమయంగా దర్శనమిస్తోంది. రహదారిపై నిలిచిన వర్షనీరు సైతం ఎటూ పోవడానికి వీలు లేకపోవడంతో వర్షపు నీటితో రహదారి గోతులు కనపడక పోవడంతో వాహన దారులు పలు మార్లు ప్రమాదాలకు గురైన సంఘటనలు అనేకం ఉన్నాయి. ఈ రహదారి గుండా పర్ణశాల రామాలయానికి ఒరిస్సా, చత్తీష్‌ఘడ్, ఏపీ రాష్ట్రాలకు చెందిన ప్రజలు వస్తుంటారు. దీంతో పాటు మండల కేంద్రంగా ఉన్న లకీëనగరానికి మండలంలోని పలు గిరిజన గ్రామాల ప్రజలతో పాటు చత్తీస్‌ఘడ్‌కు చెందిన గిరిజనులు సైతం ప్రతి రోజు వివిద పనులపై వాహనాల ద్వారా వచ్చి పోతుంటారు. దీంతో పాటు రహదారి పొడవునా సుమారు ఆరు కిమీ మేర పెద్ద ఆర్లగూడెం వరకు రహదారి పలు చోట్ల గోతుల మయంగా తయారు కావడంతో పాటు కోతలకు గురైంది. ఇంతటి ప్రాముఖ్య కలిగిన రహదారిని పాలకులు పట్టించుకోక పోవడంపై వాహనదారలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎల్ ఎల్ రహదారి బాగుపడేదెన్నడో : అంతరాష్ట్ర రహదారిగా ఉన్న ఎల్ ఎల్ రహదారి బాగుపడేది ఎన్నడో అని ప్రజలు నిలదీస్తున్నారు. వర్షాకాలం వచ్చిందంటే చాటు రహదారిపై ప్రయాణంతో నరకయాతన అనుభవిస్తున్నామని వాహన దారులు వాపోతున్నారు. గత ఏడాది ఎల్ఎల్ రహదారికి నిధులు మంజూరు అయ్యాయని అధికార పార్టీకి చెందిన నాయకులే పత్రికా ప్రకటనలు ఇచ్చినప్పటికీ ఆర్అండ్బి అధికారులు మాత్రం డబుల్ రహదారిగా మార్చి నిధులు మంజూరు కోసం ప్రతిపాదనలు మాత్రమే పంపించడం జరిగిందని తెలిపారు. ఏది ఎమైనా అంతరాష్ట్ర రహదారిగా నిత్యం మండల వాసులతో పాటు ఇతర రాష్ట్రాల ప్రజలు రాక పోకలు సాగించే ఎల్ ఎల్ రహదారికి నిధులు కేటాయించి డబుల్ రహదారిగా నిర్మించాలని ఈ ప్రాంత వాసులు, వాహనదారులు కోరుతున్నారు.