Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మణుగూరు
మణుగూరు సింగరేణి కాలరీస్ ఆధ్వర్యంలో నిర్వహించబడిన వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ నూరు శాతం సాధించామని ఏరియా జనరల్ మేనేజర్ జక్కం రమేష్ తెలిపారు. ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ... సింగరేణి యాజమాన్యం మొదటి విడుతగా 45 నుండి 60 యేండ్ల నుండి సింగరేణీయులకు, మాజీ సింగరేణీయులకు వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగిందన్నారు. మణుగూరు ఏరియాలోనూ మేగా వ్యాక్సినేషన్ పోగ్రాంను ప్రతిష్టాత్మకంగా తీసుకొని భద్రాద్రి స్టేడియం, సీఈఆర్ క్లబ్ నందు యుద్ద ప్రతిపాధికన రెండు వ్యాక్సినేషన్ సెంటర్లు, ఏరియా ఆసుపత్రిలో మరో రెండు వ్యాక్సినేషన్ సెంటర్లను అవసరమైన సదుపాయాలతో ఏర్పాటు చేసి 18-60 మధ్య సంవత్సారాల ఉద్యోగులకు మెగా వ్యాక్సినేషన్ మొదటి డోస్ కార్యక్రమం పకడ్బందీ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మొత్తం 2639 ఉద్యోగులకు గాను 2365 మందికి మొదటి డోస్ ఇవ్వడం జరిగిందన్నారు. కరోనా నిబంధనల ప్రకారం 90 రోజుల తరువాత వ్యాక్సిన్ తీసుకోవాల్సిన ఉద్యోగులు 201 మంది, దీర్ఘకాలక వ్యాధులతో బాధపడుతూ ప్రస్తుతం వ్యాక్సిన్ తీసుకోలేని స్థితిలో వున్న 73 మంది ఉదోగ్యులకు ఆరోగ్య మెరుగైన తరువాత ఇవ్వడం జరుగుతుందన్నారు.