Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాపరులకు నష్టపరిహారం చెల్లించాలి
- జీఎంపీఎస్ జిల్లా కార్యదర్శి మేకల నాగేశ్వరరావు డిమాండ్
నవతెలంగాణ-రఘునాధపాలెం
నకిలీ మందులు పంపిణీ చేసి గొర్రెలు చనిపోవడానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, నష్టపోయిన గొర్రెల కాపరులకు నష్టపరిహారం చెల్లించాలని తెలంగాణ గొర్రెలు మేకల పెంపకం దారుల సంఘం (జీఎంపీఎస్్) జిల్లా కార్యదర్శి మేకల. నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. మండలం పరిధిలో స్థానిక చిమ్మపూడి గ్రామానికి చెందిన జోనెబోయిన నర్సయ్యతో పాటు ఇంకా ముగ్గురు గొర్రెల కాపరులు ఖమ్మం పట్టణంలోని ఓ ప్రైవేట్ మెడికల్ షాప్ నుండి తీసుకొచ్చి వేసినట్టు వంటి మందులు నాణ్యత లోపం వలన దాదాపుగా పది గొర్రెలు చనిపోయాయి. గొర్రెలు చనిపోవడాని నిరసిస్తూ జి.యమ్ పి. యస్ ఆధ్వర్యంలో చిమ్మాపుడి గ్రామంలో గొర్రెల కాపరులు నిరసన ఆందోళన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ-గొర్రెలకు దగ్గు వస్తుందని ఖమ్మంలో ఉన్న ఓ ప్రైవేట్ మెడికల్ షాప్ లో మందులను తెచ్చి గొర్రెల కాపరులు సుమారు అయిదు వందల గొర్రెలకు ఆ మందుని పోయడం వల్ల ఇప్పటికే సుమారు పది గొర్రెలు చనిపోయాయని, ఇంకా సుమారు ఇరవై గొర్రెల పరిస్థితి విషమంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గొర్రెలు చనిపోయిన కుటుంబాలకు సుమారు లక్ష రూపాయలపైన నష్టం జరిగిందని తెలిపారు. నకిలీ మందులు పంపిణీ చేస్తున్న వారిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డ్రగ్ అధికారులని కోరారు. మెడికల్ షాప్‌ని, కంపెనీని సీజ్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని, భాదితులకు నష్టపరిహారాన్ని చెల్లించేలా చూడాలని ఆయన డిమాండ్ చేశాడు. లేనియెడల సంఘం ఆధ్వర్యంలో దశలవారిగా ఆందోళనలు చేస్తామని వారు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ ఖమ్మం జిల్లా సహాయ కార్యదర్శి చింతల రమేష్, గొర్రెల సొసైటీ గ్రామ అధ్యక్షులు జోనెబోయిన.పాపయ్య యాదవ్, గ్రామ అయిదవ వార్డు మెంబర్ కంపసాటి వేణు యాదవ్, జీఎంపీఎస్ మండల నాయకుడు నగేష్, యాదవ సంఘం, గొర్రెల సొసైటీ సభ్యులు పరిటాల. నాగయ్య, దనియకుల. సాయిరాం, కంపసాటి. ప్రవీణ్ పాల్గొన్నారు.