Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గాంధీచౌక్
ఖమ్మం పట్టణంలోని ఎస్బిఐ బ్యాంకు మెయిన్ బ్రాంచ్ వైరా రోడ్ నందు ఆదివారం స్టాఫ్ యూనియన్ హైదరాబాద్ సర్కిల్ ఖమ్మం రీజియన్ తరుపున 70 నిరుపేదల కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేసారు. అంతేకాకుండా బాలల సదనం యూనియన్ కి వాషింగ్ మిషన్, నేబ్లెజర్, బెడ్స్, పిల్లలు ఆడుకొనే ఆట వస్తువులు పంపిణీ చేశారు. ప్రతి సంవత్సరం జూన్ 20న అండర్ యూనియన్ సోషల్ రెస్పాన్సిబిల్టీ లీడర్ అయినా కామ్రేడ్ వై.తారక్ నాథ్ జ్ఞాపకార్ధంగా నిరుపేదలకు ఇవన్నీ సహాయం చేశారు. ఎస్బి.ఐ. ఏ.జి.ఎం. సునీత పేరుకొన్నారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం రీజినల్ మేనేజర్ రాస్మెక్ ఏ.వి. నారాయణారావు, ఎస్బిఐ నల్గొండ ఏఓ కే నందన్, బాలల సదనం యూనియన్ తరుపున సభ్యులు, ఖమ్మం రీజినల్ సెక్రటరీ చిన్నప్ప రెడ్డి యూనియన్ మెంబెర్స్ తదితరులు పాల్గొన్నారు.