Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యకాస జిల్లా ప్రధాన కార్యదర్శి పొన్నం వెంకటేశ్వరరావు
నవతెలంగాణ-ఖమ్మం రూరల్
ఉపాధి పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొన్నం వెంకటేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఖమ్మం రూరల్ మండల కమిటీ సమావేశం వరంగల్ క్రాస్ రోడ్ లోని తమ్మినేని సుబ్బయ్య భవన్లో సంఘం మండల నాయకులు పల్లె శ్రీనివాసరావు అధ్యక్షతన ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశంలో పొన్నం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీలు పనిచేసే ప్రదేశాల్లో ఎండ తీవ్రతకు తట్టుకునేలా టెంట్లు వేయాలని, మెడికల్ కిట్లు, తాగునీటి సౌకర్యం కల్పించాలని, పని ప్రదేశాల్లో శానిటైజర్లు, మాస్కులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మండల పరిధిలోని కాచిరాజుగుడెం, ఎం.వెంకటాయపాలెం, గుదిమళ్ళ, వెంకటగిరి, కోట నారాయణపురం గ్రామాలలో ఉపాధి హామీ పనులు జరుగుతున్న పని ప్రదేశాల్లో వ్యవసాయ కార్మిక సంఘం బందం పరిశీలించి వారి సమస్యలు తెలుసుకున్నారు.ఈ సందర్భంగా పలు సమస్యలు సంఘం దృష్టికి వచ్చాయి. ఈ సందర్భంగా సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పొన్నెకంటి సంగయ్య మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీలకు రోజుకు రూ.600 ఇవ్వాలని, కొత్త కూలీలకు గడ్డపారలు, బొచ్చలు అందజేయాలన్నారు. 11 వారాలు నుండి పనిచేస్తున్నప్పటికీ ఉపాధి కూలీలకు రోజు ఎంత కూలీ పడుతుందో తెలుసుకునే విధంగా ప్లే స్లిప్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా కమిటీ సభ్యులు బందెల వెంకయ్య,మండల కార్యదర్శి వడ్లమూడి నాగేశ్వరరావు, మండల కమిటీ సభ్యులు కొట్టే రామయ్య, పి.సుధాకర్, కర్లపూడి వెంకటేశ్వర్లు, మునిగంటి యాదగిరి, దండు సైదులు,మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.