Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మృతురాలి కుటుంబానికి ఎమ్మెల్యే చేతుల మీదుగా రూ.5లక్షల చెక్కు అందజేత
నవతెలంగాణ- సత్తుపల్లి
విద్యుత్ షాక్‌తో మృతి చెందిన మండలంలోని కిష్టారం గ్రామ పంచాయతీ అంబేద్కర్‌నగర్‌కు చెందిన పాలకుర్తి తులిశమ్మ కుటుంబానికి నష్ట పరిహారంగా విద్యుత్‌శాఖ ద్వారా మంజూరైన రూ. 5లక్షలను ఏడీఈ కిరణ్‌కుమార్ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య చేతుల మీదుగా మృతురాలి భర్త పాలకుర్తి దాసుకు ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందించారు. గత యేడాది ఆగస్టు నెలలో కిష్టారం అంబేద్కర్‌నగర్‌కు చెందిన పాలకుర్తి తులిశమ్మ విద్యుత్ షాక్‌కు గురై మరణించిన విషయం విధితమే. ఈ నేపధ్యంలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రత్యేక చొరవ చూపగా మృతురాలు తులిశమ్మ కుటుంబానికి విద్యుత్‌శాఖ అధికారులు రూ. 5లక్షలను నష్ట పరిహారంగా మంజూరు చేశారు. ఈ పరిహారం గాక తులిశమ్మ టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకున్న నేపధ్యంలో బీమా కింత రూ. 2లక్షలు చెక్కును ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తులిశమ్మ కుటుంబానికి రెండు నెలల క్రితం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దొడ్డా హైమవతిశంకరరావు, మున్సిపల్ ఛైర్మెన్ కూసంపూడి మహేశ్, డీసీసీబీ డైరెక్టర్ చల్లగుండ్ల కృష్ణయ్య, సత్తుపల్లి విద్యుత్‌శాఖ ఏడీఈ కిరణ్‌కుమార్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు యాగంటి శ్రీనివాసరావు, కిష్టారం ఎంపీటీసీ సభ్యులు పాలకుర్తి సునీతరాజు, నాయకులు దొడ్డా శంకరరావు, ములకలపాటి విష్ణువర్దనరావు, కొడిమెల అప్పారావు, జవ్వాజి అప్పారావు, బొంతు నరేంద్ర, పాలకుర్తి రవి, కిష్టారం లైన్ ఇన్స్పెక్టర్ రాంబాబు పాల్గొన్నారు.