Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నూతన అధ్యక్షులుగా బోగాల శ్రీనివాస రెడ్డి
- కార్యదర్శిగా పామరాజు తిరుమల రావు
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలం పట్టణంలోని, రెడ్డి సత్రం (రాఘవ భవన్)లో, గ్రీన్ భద్రాద్రి సంస్థ 2021-2022 సంవత్సరానికి గానూ నూతన కమిటీని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షులుగా బోగాల శ్రీనివాసరెడి, ప్రధాన కార్యదర్శిగా పామరాజు తిరుమలరావు, కోశాధికారిగా ఉప్పాడ రాంప్రసాద్ రెడ్డి, జాయింట్ సెక్రటరీగా శీలం రామ్మోహన్ రెడ్డిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం నూతన కార్యవర్గం వారి ప్రమాణ స్వీకార కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. భద్రాచల పట్టణాన్ని మరింత పచ్చదనంతో, నందనవనంగా మారుస్తామని, దీనికి పట్టణ ప్రజలు,పుర ప్రముఖులు, పర్యావరణ వాదులు సహకరించాలని గ్రీన్ భద్రాద్రి నూతన అధ్యక్షులు బోగాల శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం శాసన సభ్యులు పొదెం వీరయ్య ముఖ్య అతిధిగా పాల్గొని గ్రీన్ భద్రాద్రి సేవలు మరవలేనివని భద్రాచలాన్ని పచ్చని భద్రాద్రిగా మార్చుటకు వీరు చేస్తున్న కృషి మరవలేనిదని పేర్కొన్నారు. గ్రీన్ భద్రాద్రికి నావంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని తెలిపారు. ఈ సందర్భంగా నూతన కమిటినీ అభినందించి, ఘనం గా ఎమ్మెల్యేని సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, భధ్రాచలం నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ తెల్లం వెంకటరావు, బొలిశెట్టి రంగారావు, గోళ్ళ భూపతిరావు, యేగి సూర్యనారా యణ, జగదీష్, మారం వెంకటేశ్వరరెడ్డి, జి.రాజారెడ్డి, జి.యస్.శంకరరావు, సోమరౌతు శ్రీనివాస్, భీమవరపు వెంకటరెడ్డి, మందపాటి సుధాకర్ రెడ్డి, పల్లంటి దేశప్ప, గ్రీన్ భద్రాద్రి బాధ్యులు, వివిధ రంగాల ప్రముఖులు హాజరై, నూతన కమిటీకి అభినందనలు తెలిపారు.