Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మండలంలో విస్తృతంగా తనిఖీలు
- హరితహరం ప్రారంభానికి సిద్ధంగా ఉండాలి
నవతెలంగాణ-అశ్వారావుపేట
పాల్వంచ ఆర్డీఓ స్వర్ణలత అశ్వారావుపేటలో గత రెండు రోజులుగా ఆకస్మికంగా పర్యటిస్తు న్నారు. ఉదయం 6 గంటలు నుండే ఆమె పంచాయతీల్లో పర్యటిస్తూ స్థానిక ప్రజాప్రతినిధులను, అధికా రులను త్వరలో ప్రారంభించబోయే హరితహారం కార్యక్రమానికి సన్నద్దం చేస్తున్నారు. ఆర్డీఓ స్వర్ణలతను ఈ ఏడాది హరితహారం పధకం అమలుకు అశ్వారావుపేట నియోజక వర్గం ప్రత్యేక అధికారిగా కలెక్టర్ అనుదీప్ నియమించారు. దీంతో ఆమె నియోజక వర్గంలోని గతంలో అమలు అయిన హరిత హారం పధకం స్థితి గతులను, పల్లె ప్రగతి పురోభివృద్ధిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
ఆదివారం అశ్వారావుపేట, ఊట్లపల్లి, వినాయకపురం, జమ్మిగూడెం, మామిళ్ళవారిగూడెం, కోయరంగాపురం పంచాయతీల్లో ఆకస్మికంగా పర్యటించి నర్సరీలను, వైకుంటధామాలను, పారిశుధ్యం పనులను పరిశీలించారు. అశ్వారావుపేటలో పారిశుధ్యం పనులు జరిగే తీరును దగ్గరగా, క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఈఓ హరిక్రిష్ణకు పలు సూచనలు చేసారు. హరితహారం ప్రారంభానికి సన్నద్దం కావాలని ఆదేశించారు.