Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూఈఈయూ-సీఐటీయూ కమిటీ
- బీసీఆర్ ట్రస్టు సేవలు అభినందనీయం
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలంలో బండారు చందర్రావు ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కరోనా ఐసోలేషన్ కేంద్రం నిర్వహణ తీరుకు స్పందించి యూనైటెడ్ ఎలక్ట్రసిటీ ఎంప్లాయ్షిస్ యూనియన్ (యూఈ ఈయూ-సీఐటీయూ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ విద్యుత్ రంగం కార్మికుల తరుఫున రూ.52,111 వేలు విరాళాన్ని బీసీఆర్ ట్రస్టుకు అందజేశారు. ఆదివారం ఈ విరాళాన్ని బీసీఆర్ ట్రస్టు నిర్వహకులు, సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజె.రమేష్‌కి యూఈఈయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కొలగాని రమేష్, బొల్లి వెంకటరాజు, రాష్ట్ర కమిటీ సభ్యులు శ్రీను, కూనురాజు శ్రీనివాస్, డివిజన్ నాయకులు వగుడిపల్లి సీతారాములు, బుడిగే రమేష్, దూడల శ్రీను తదితరులు విరాళాన్ని అంజేశారు. ఈ సందర్భంగా బొల్లి వెంకటరాజు, కొలగాని రమేష్‌లు మాట్లాడుతూ కరోనా బాధితులకు సేవచేసే కార్యక్రమంలో భాగస్వాము లవుతున్నందుకు గర్వపడుతున్నామని అన్నారు. బీసీఆర్ ట్రస్టు సేవలు అభినందనీయమని అన్నారు. ఐసోలేషన్ కేంద్రంలో అందిస్తున్న సౌకర్యాలు అద్భుతంగా వున్నాయని అన్నారు. కరోనా బాధితు లకు మనోదైర్యం నింపి వారి ప్రాణాలుకాపాడుతున్న బీసీఆర్ ట్రస్టు సేవలకు వెలకట్టలేమని అన్నారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజె.రమేష్ మాట్లాడుతూ ప్రజలు కష్టకాలంలో వుంటే వారికి కార్మిక వర్గం అండగా నిలవాలనే సీఐటీయూ కర్తవ్యాన్ని అమలు చేస్తున్న యూఈఈయూ కమిటీని అభినందించారు. కార్మిక వర్గం అండతోటి బీసీఆర్ ట్రస్టు సేవలను భవిష్యత్‌లోనూ కొనసాగిస్తామని ఏజె రమేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యాక్షులు కె.బ్రహ్మాచారి, బీసీఆర్ ట్రస్టు కనిర్వహకులు గడ్డం స్వామి, మర్లపాటి రేణుక, యం.బీ.నర్సారెడ్డి, బండారు శరత్ బాబు, సున్నం గంగా, ఫిరోజ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.