Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలి
- ఉపాధి పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి
- డీఆర్డీఏ పీడీ ఆఫీస్ ముందు ప్రజా సంఘాల ధర్నా
- ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతా : పీడీ
నవతెలంగాణ-కొత్తగూడెం
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కూలీలలో కుల విభజన చేయడం సరి కాదని, జీవోను వెంటనే ఉప సంహరించుకోవాలని, ఉపాధి హామీ పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, కేవీపీఎస్, గిరిజన సంఘాల ఆధ్వర్యంలో కొత్తగూడెం జిల్లా గ్రామీణాభివృద్ధి పీడీ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సంద్భంగా వ్యకాస జిల్లా ప్రధాన కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఉపాధి కూలీలను వర్గాలుగా, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్డ్ తెగలుగా విభజన చేసి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఫండ్ బదిలీ ఉత్తర్వులు తీసుకు వచ్చిందన్నారు. ఈ ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రజా సంఘాలు దేశ వ్యాపిత పిలుపు నిచ్చాయని, అందులో భాగంగా ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఒకే వేతనానికి అర్హత ఉన్న కార్మికులను వివిధ కుల, వర్గాలుగా విభజించటానికి ఎటువంటి హేతు బద్దత లేదన్నారు. ఇది చట్ట విరుద్ధం అన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని బంగ పరుస్తుంతుందని తెలిపారు. పెండిగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని, 200 పని దినాలు, రోజు కూల రూ.600 లు ఇవ్వాలని, కరోనా కరువు భత్యం రూ.7,500లు, ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యకాస జిల్లా ఉపాధ్యక్షుడు అన్నవరపు కనకయ్య, అధ్యక్షుడు జటోత్ కృష్ణ, నల్లమల్ల సత్యనారా యణ, నాగేశ్వరావు, కేవీపియస్ నాయకులు మేరుగు ముత్త య్య, నందిపాటి రమేశ్, రింగు వెంకటయ్య, గిరిజన సంఘ ం నాయకులు వాంకుడోత్ కోబల్ తదితరులు పాల్గొన్నారు.
పినపాక : ఉపాధి హామీ పనుల కల్పనలోనూ కేంద్ర ప్రభుత్వం కుల విభజనకు చర్యలు చేపట్టడం అన్యాయమని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు నిమ్మల వెంకన్న అన్నారు. సోమవారం ప్రజాసంఘాలు, తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, కేవీపీఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని మండలంలోని ఈ బయ్యారం క్రాస్‌రోడ్డులో చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధి పనుల్లో తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా నాయకులు మడివి రమేష్, కేవీపీఎస్ అధ్యక్షులు పూస శ్రీను, రైతు సంఘం నాయకులు రామయ్య, ఆదయ్య, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఇల్లందు : పంచాయతీల్లో ఉపాధి హామీ పనులకు దళితులు, గిరిజనులకు సబ్ ప్లాన్ నిధులనుండి వేతనాలు చెల్లించడం సరైనది కాదని వ్యవసాయ కార్మిక, ఆదివాసీ గిరిజన సంఘాల నేతలు అబ్దుల్ నబీ వజ్జా సురేష్ అన్నారు. వ్యకాస, ఆదివాసీ గిరిజన సంఘం అధ్వర్యంలో సోమవారం బాలాజీ నగర్ సర్పంచ్ కార్యదర్శి సుభాష్ నగర్ కార్యదర్శు లకు వినతి పత్రాలు సమర్పించి, మాట్లాడారు. ఉపాధి హామీ పథకం అమలులో కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతలను విస్మరిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మురళి పాల్గొన్నారు.