Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అనుమానం వ్యక్తం చేస్తున్న మృతుడి తల్లిదండ్రులు
నవతెలంగాణ-జూలూరుపాడు
మండలంలోని కొమ్ముగూడెం గ్రామానికి చెందిన బాణోత్ నగేష్ (23) అనే యువకుడు ఊరు శివారు పొలంలో ఉన్న బావిలో అనుమానాస్పద స్థితిలో సోమవారం మృతి చెందాడు. వివరాలు మేరకు...ఎప్పటిలాగానే మృతుడు నగేష్ గ్రామంలో క్యారమ్ బోర్డ్ ఆటకు వెళుతూ ఉండేవాడు. శనివారం ఆటకి వెళ్ళి ఆట ఆడుకునే ప్రదేశంలో ఇద్దరి వ్యక్తులతో గొడవపడి ఇంటికి వచ్చి పడుకున్నాడు. అదే రోజు రాత్రి సుమారుగా 9 గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు ఇంటి మీదకు వచ్చి గొడవ చేయగా వారిని నచ్చ చెప్పి తల్లిదండ్రులు పంపారు. కొద్దిసేపటి తరువాత ఇంటి నుండి బయటకు వెళ్లిన నగేష్ తిరిగిరాలేదు. సోమవారం ఉద యాన్నే మృతుడు గ్రామ శివారు పొలంలో ఉన్న బావిలో పడి తేలుతూ ఉన్నాడు. కుటుంబీకులు బావి వద్దకు చేరుకొని చుట్టుపక్కలవారి సహాయంతో బావిలో ఉన్న మృతదేహాన్ని బయటకు తీశారు. దీనితో ఒక్కసారిగా గ్రామంలో విషాద ఛాయలు అలుమకున్నాయి. మృతుడి తల్లితండ్రులు బానోత్ చిట్టిబాబు, తల్లి చిలకమ్మ తన కొడుకు ఆత్మహత్య చేసుకోడని, గత మూడు రోజుల క్రితం ఇద్దరు యువకులు గొడవ పడ్డారని వారిపై అనుమానం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతికి సంభందించి వివరాలను సేకరించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టబుల్ శివాజీ గణేష్, స్టేషన్ రైటర్ నరసింహరాజు, కానిస్టేబుల్స్ లాల్ మహామద్, కృష్ణ ఉన్నారు.