Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముట్టడి
నవతెలంగాణ-చర్ల
నిరుపేదలకు అందుబాటులో ఉండే విధంగా మండల కేంద్రంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను సక్రమంగా నిర్వహించాలని సోమవారం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముట్టడి చేసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ మండల నాయకులు కొండా చరణ్ మాట్లాడుతూ.... దశాబ్దలకాలంగా నిరుపేదలకు అందుబాటులో ఉండే వైద్యశాల అధికారుల అనాలోచిత వలన వైద్యం పేదలకు అందని ద్రాక్షగా మిగిలిందని ఆయన మండిపడ్డారు.
వందల సంవత్సరాలుగా కేరళ మండల కేంద్రంలో నిర్వహిస్తున్న ప్రాథమిక వైద్యశాల కొయ్యూరుకి తరలించి నేడు మండల కేంద్రంలో వైద్యశాలను లేకుండా చేసిన అధికారులు, ప్రజా ప్రతినిధులు సిగ్గుతో తలదించుకోవాలన్నారు. కాళ్లు, వేలు నొచ్చిన అందుబాటులో ఉన్న ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకునే స్థితి లేకుండా మండల కేంద్రానికి సుదూరంగా ప్రాథమిక వైద్యశాల నిర్మించి పేదల పాలిట శాపంగా మారిందని ఆయన మండిపడ్డారు. మండల కేంద్రంలో ఉన్న సీమాంగ్ సెంటర్లో విధులు నిర్వహించే సిబ్బంది సైతం రెగ్యులరైజేషన్ పేరిట వేర్వేరు ప్రాంతాలకు వెళ్లనున్నట్టు విశ్వసనీయ సమాచారం ఉందన్నారు.
పోస్టుమార్టం మండల కేంద్రంలోనే నిర్వహించాలి
ప్రమాదవశాత్తు ఎవరైనా మృతి చెందితే ఆ మృతదేహాన్ని భద్రాచలం వరకు తీసుకు వెళ్లి భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించడం వల్ల నానా అవస్థలు గురికావలసి వస్తుందని చరణ్ ఉన్నత అధికారులను కోరారు. కావున పోస్టుమార్టం మండల కేంద్రంలోనే నిర్వహించాలని కోరారు. కలెక్టర్, భద్రాచలం ఐటీడీఏ పీఓ స్థాయి అధికారులు చొరవచూ పాలన్నారు. అనంతరం సమస్యలతో కూడిన మెమోరాండం తహసీల్దార్ వీరభద్ర ప్రసాద్‌కు అందించారు. సానుకూలంగా స్పందించి ఆయన సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని తెలపడంతో నాయకులు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బోళ్ళ వినోద్, మచ్చా రామారావు, బందెల చంటి, పొడుపు గంటి సమ్మక్క, చింతూరి రజినీకాంత్, ముత్యాలరావు, పవన్ సాంబ, శిరోని, సూరమ్మ తదితరులు పాల్గొన్నారు.