Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి
నవతెలంగాణ-కొత్తగూడెం
కాంట్రాక్టు, ఔట్సోర్సు ఎప్లాయిస్కు ఉద్యోగ భద్రత కల్పించాలి-పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తు సోమవారం కలెక్టరేట్లో కార్యాలయ ఏఓ ఘన్యాకి ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు పిఆర్సీ ప్రకారము వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, పెండింగ్ వేతనాలు చెల్లించాలని తదితర సమస్యలతో కూడిన మెమోరాండం అందజేశారు. అనంతరం జరిగిన సభలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ మాట్లాడారు. 11వ పిఆర్సి కమిషన్ సిఫార్సు చేసిన మేరకైనా కనీస వేతనం రూ.19 వేలు, రూ.22,900లు, రూ.31,040లుగా ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. కనీస వేతనంతో పాటు, డీఏ, హెచ్ఆర్ఏ వర్తింప చేయాలన్నారు. పెండింగ్లో ఉన్న వేతన బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఔవుట్సోర్సింగ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ నాయకులు మోహన్, కాలబాబు, భట్టుకృష్ణ, హరి, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.