Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పల్లె ప్రగతిపై అధికారుల్లో లోపించిన చిత్తశుద్ధి
- గ్రామాల్లో పర్యటించి అసహనం వ్యక్తం చేసిన మంత్రి పువ్వాడ
- పందిళ్లపల్లి, జగన్నాధపురం గ్రామాల్లో ఆకస్మిక తనిఖీ
నవతెలంగాణ-చింతకాని
పల్లెల్లో జరుగుతున్న ప్రగతిని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్ స్వయంగా తనిఖీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి ద్వారా చేపట్టిన కార్యక్రమాలు, నిర్వహించబోయే పల్లె ప్రగతిలో చేపట్టాల్సిన పనులపై మంత్రి తెలుసుకున్నారు. చింతకాని మండలం పందిళ్లపల్లి, జగన్నాధపురం గ్రామంలో కలియ తిరిగారు. రోడ్డు పక్కన గల కాల్వలో పేరుకుపోయున్న చెత్తను చూసి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశుధ్యంపై సిబ్బందికి బాధ్యత లేదా అని కార్యదర్శిని ప్రశ్నించారు. కళ్లెదుటే ఇంత చెత్త, మట్టి కుప్పలు, పిచ్చి మొక్కలు కనిపిస్తుంటే ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశుధ్యం ఇంత అద్వాన్నంగా ఉంది... ఏం చేస్తున్నారు..? ఇలా ఉంటే రోగాలు, వ్యాధులు ప్రభాలవా అని ప్రశ్నించారు. పల్లె ప్రగతి ద్వారా ఇవన్నీ పనులు చేయాల్సి ఉన్నప్పటికీ ఎందుకు చేయలేదన్నారు. గ్రామంలోని నర్సరీని సందర్శించి పలు సూచనలు చేశారు. నర్సరీలోని ఆయా మొక్కలను ప్రణాలికతో 100శాతం నాటి సంరక్షించే బాధ్యతను ప్రజాప్రతినిధులు, అధికారులు తీసుకోవాలన్నారు. అనంతరం జగన్నాధపురం గ్రామంలో మంత్రి పువ్వాడ ఆకస్మిక పర్యటించారు. వైకుంఠధామం, రోడ్లు, వీధి దీపాలు, రైతు వేదికను సందర్శించారు. గ్రామంలోని పారిశుధ్యంను తనిఖీ చేశారు. రోడ్డుకు ఇరువైపులా పేరుకుపోయిన చెత్తను చూసి ఇదేనా పల్లె ప్రగతిలో మీరు చేసింది అని అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి నెల నేరుగా పంచాయతీలకు నిధులు ఇస్తూ గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యానికి అడుగులు వెయిస్తున్నారన్నారని అందుకు తగ్గట్టు మీరు పని చేయాలని సూచించారు.
గ్రామంలో హరితహారం సందర్భంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని సూచించారు. స్వచ్ఛత పై దష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. వారి వెంట జిల్లా కలెక్టర్ కర్ణన్, వ్యవసాయ అధికారి విజయనిర్మల, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ, ఎంపీపీ పూర్ణయ్య, జడ్పీటిసి కిషోర్, పంచాయతీ రాజ్, రెవిన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.