Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పినపాక
వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పారిశుధ్య పనులు చేపట్టాలని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అధికారులకు సూచించారు. మండలంలో సోమవారం ఆయన ఆకస్మికంగా పర్యటించారు. ఈ బయ్యారం క్రాస్ రోడ్, జనంపేట, మల్లారం తదితర ప్రాంతాల్లో పర్యటించి స్థానికులను సమస్యలను, అభివృద్ధి కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. సర్పంచ్, సెక్రటరీలకు పలు సూచనలు చేశారు. కరోన నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సెక్రటరీలు, సర్పంచులు పాల్గొన్నారు.