Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన
నవతెలంగాణ- ఖమ్మంరూరల్
పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు. మండలంలోని వరంగల్ క్రాస్ రోడ్డు వద్ద గల తమ్మినేని సుబ్బయ్య భవన్ ఎదుట సోమవారం ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఎం అనుబంధ సంఘాలైన తెలంగాణ రైతు సంఘం, వ్యవసాయ కార్మికసంఘం, సిఐటియు,డివైఎఫ్ఐ సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా నాయకులు తుమ్మల శ్రీనివాసరావు మాట్లాడుతూ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడంతో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి పేదవాడు బతకడం చాలా కష్టంగా ఉందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదలను కొట్టి పెద్దలకు ఊడిగం చేస్తున్నాయని విమర్శించారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పొన్నెకంటి సంగయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు బందెల వెంకయ్య, వడ్లమూడి నాగేశ్వరరావు, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి పెరుమల్లపల్లి మోహన్రావు, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ముదాం శ్రీనివాసరావు, సిఐటియు మండల కన్వీనర్ మేడికొండ నాగేశ్వరరావు, ఆయా ప్రజా సంఘాల నాయకులు నందిగామ కృష్ణ, డి.రాంబాబు, కర్లపూడి వెంకటేశ్వర్లు, మొరబోయిన పుల్లయ్య, జక్కంపూడి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.