Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- బోనకల్
చిరునోముల గ్రామ సమస్యలపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు సానుకూలంగా స్పందించారు. మండల పరిధిలోని చిరునోముల గ్రామ సర్పంచ్ ములకారపు రవి, ఉద్యోగ విరమణ చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయులు వాసిరెడ్డి సీతారామయ్య సోమవారం ఖమ్మంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో కలిసి చిరునోముల గ్రామ సమస్యలపై వినతి పత్రం అందజేశారు. అదేవిధంగా జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజుని కూడా కలిసి సమస్యలను వివరించారు. చిరునోముల బస్సు షెల్టర్ నుంచి చిరునోముల వరకు గల రెండు కిలోమీటర్లు ఆర్ అండ్ బి రోడ్డు పెద్ద పెద్ద గుంతలు పడి కనీసం ద్విచక్ర వాహనాలు కూడా వెళ్లలేని పరిస్థిత ఉంది. ఈ రోడ్డుపైనే గల బి బి సి కాలువపై గల బ్రిడ్జి కూడా అత్యంత ప్రమాదకరంగామారి ఏ సమయంలో కూలి పోతుందో తెలియని భయానక పరిస్థితి ఉంది. ఈ బ్రిడ్జి ప్రమాదపు అంచున ఉంది. అదే విధంగా వాసిరెడ్డి సీతారామయ్య ఇంటి దగ్గర నుంచి ఆముదాల కోటమ్మ ఇంటి వరకు సిసి రోడ్డుకు నిధులు మంజూరు చేయాలని జిల్లా పరిషత్ చైర్మన్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. వినతిపత్రం అందజేయడమే కాక రోడ్డు, బ్రిడ్జి పరిస్థితిని కూడా వివరించారు. దీనిపై మంత్రి, జిల్లా పరిషత్ చైర్మన్ సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేయగానే సాధ్యమైనంత తొందర్లోనే చిరునోముల రోడ్డు, బ్రిడ్జికి,సిసి రోడ్డుకు నిధులు మంజూరు చేస్తామని వారికి హామీ ఇచ్చారు.