Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వైరా
టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు పసుపులేటి మోహన్ రావు అధ్యక్షతన వైరా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు ఎమ్మెల్యే రాములునాయక్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మొక్కలు నాటి వృద్ధులకు చీరెలు పంపిణీ చేశారు. అలాగే జన జాగృతి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వికలాంగులకు వీల్చీర్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర మార్క్‌ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, వైరా మున్సిపల్ చైర్మన్ జైపాల్, వైస్ చైర్మన్ ముళ్ళ పాటి సీతారాములు, మార్కెట్ చైర్మన్ గుమ్మా రోశయ్య, ఎంపీపీ వేల్పుల పావని, జెడ్పిటిసి నంబూరి కనకదుర్గ, పట్టణ అధ్యక్షుడు ధారణ రాజశేఖర్ పాల్గొన్నారు
ఎంఎల్ఏకు సన్మానం
వైరా మున్సిపల్ కార్యాలయం నందు మున్సిపల్ చైర్మన్ సూతకం జైపాల్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రాములు నాయక్ చేతుల మీదుగా వైరా మున్సిపాలిటీ లో నూతనంగా మూడు ట్రాక్టర్లను ప్రారంభించారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ సూత కానీ జైపాల్ అధ్యక్షతన మున్సిపల్ కార్యాలయం నందు ఎమ్మెల్యే రాములు నాయక్ జన్మదినం సందర్భంగా అలాగే పెళ్లి రోజు సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మరియు సిబ్బంది మున్సిపల్ పాలకవర్గం ఘనంగా సన్మానించారు అనంతరం మున్సిపాలిటీలో నూతనంగా మూడు ట్రాక్టర్ లను కొనుగోలు చేసి మున్సిపాలిటీ లో ఉన్నటువంటి వివిధ వార్డులలో తడి పొడి చెత్త లను తరలించేందుకు నూతనంగా కొనుగోలు చేసిన ట్రాక్టర్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం మున్సిపాలిటీ పరిధిలోని మహిళలకు తడి పొడి చెత్త బుట్టలు పంపిణీ చేశారు.
కారేపల్లి : ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ జన్మదిన వేడుకలను సోమవారం కారేపల్లి మండల టీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. చీమలపాడులో ఎంపీపీ మాలోత్ శకుంతల, సర్పంచ్ మాలోత్ కిషోర్ల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణి చేశారు. వైరాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకున్న టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే లావుడ్యారాములునాయక్ ఎంపీటీసీ పెద్దబోయిన ఉమాశంకర్ ఆద్వర్యంలో గజమాలను ఆలంకరించి,కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈకార్యక్రమంలో వైరా ఆత్మ కమిటీ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ, ఎంపీపీ మాలోత్ శకుతంల, సోసైటీ అధ్యక్షులు దుగ్గినేని శ్రీనివాసరావు, వైస్‌ఎంపీపీ రావూరి శ్రీనివాసరావు, మండల టీఆర్ఎస్ కన్వీనర్ మల్లెల నాగేశ్వరరావు, మాజీ ప్రధానకార్యదర్శి అజ్మీర వీరన్న, సర్పంచ్‌లు మాలోత్ కిషోర్, భూక్యా రంగారావు, మండల కోఆప్షన్ ఎండీ.హనీఫ్, సోసైటీ డైరక్టర్లు అడ్డగోడ ఐలయ్య, తోటకూరి రాంబాబు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.