Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సింగరేణి డైరెక్టర్ (పా) ఎన్.బలరాం
- మనిషి ప్రకృతిలో మమేకం కావడమే యోగ
- ప్రకృతి కవి జయరాజు
- ప్రకృతి ఆశ్రమంలో ఘనంగా యోగ దినోత్సవం
నవతెలంగాణ-కొత్తగూడెం
ప్రాచీన భారతీయ సంప్రదాయం నుంచి ఒక అమూల్య కానుక, ఆరోగ్య సంపద అని సింగరేణి డైరెక్టర్ (పా) బలరాం అన్నారు. సోమవారం రైటర్ బస్తిలోని ప్రకృతి ఆశ్రమం ఆద్వర్యంలో జరిగిన 7 వ అంతర్జాతీయ యోగ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. మనస్సు - శరీరం - చిన్న ఆలోచన - చర్యలు లక్ష్యాలను యోగ ద్వారా కలిపి జీవిత సాఫల్యాన్ని పొందవచ్చన్నారు. జీవన విధానాలను, శైలిని మర్చి చేతనా శక్తిని యోగ పెంచుతుందన్నారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా దేహాన్ని ప్రకృతి యోగ మారుస్తుందని తెలిపారు. 2014 సెప్టెంబర్ 11 న ఐక్యరాజ్యసమితి 69 వ సమావేశంలో జూన్ 21 న అంతర్జాతీయ యోగ దినోత్సవంగా జరుపుకోవాలని తీర్మానించారని గుర్తుచేశారు.పరిపూర్ణ ఆరోగ్యానికి ప్రపంచ ప్రజలకు యోగ ఉపకరిస్తుందన్నారు. యోగాని ప్రతి ఒక్కరు జీవన విధానంలో భాగం చేసుకోవాలని తెలిపారు. జిల్లా కేంద్రంలో క్వాలిఫైడ్ యోగ శిక్షకులు ఉండటం అభినందనీయమని అన్నారు. ప్రస్తుతం కరోనా గడ్డుకాలంలో ఊపిరితిత్తులు సామర్ధ్యం పెంపొందించుకొని కరోనాను అధిగమించవచ్చని స్పష్టం చేశారు.
ప్రకృని ప్రేమించాలి..
ప్రముఖ ప్రకృతి కవి, గాయకుడు జయరాజు మాట్లాడుతూ మనిషి ప్రకృతిలో మమేకం కావడం వల్లనే పరిపూర్ణ ఆరోగ్యం సిద్దిస్తుందన్నారు. గాలి, నీరు, చెట్టు, పుట్టను ప్రేమిస్తేనే గొప్ప ఆరోగ్యం సిద్ధిస్తుందని, అదే జీవితం లో మనం చేసే యోగా అని అన్నారు.ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖ వైద్యులు వాసిరెడ్డి రమేష్ బాబు, తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సంగం వెంకట పుల్లయ్య, డిపిఆర్ఓ శీలం శ్రీనివాసరావు, విద్యుత్ శాఖ డిఇ విజరు, మొక్కల వెంకటయ్య, ఆశ్రమ కో-ఆర్డినేటర్ గోరింట్ల సుగుణారావు, సింగరేణి ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ గోల్ల రమేష్, మొక్కల రాజేశేఖర్, సీనియర్ యోగ మాస్టర్స్ కొచ్చెర్ల కమలారాణి, ఘంటసాల మార్తాండ నర్సింహం, పిల్లి రాజేశ్వరరావు మనోహర్, శ్రీనివాసరాజు, శారదా, మాధురి, ప్రమీల, లతా డిజీఎం గొనె శ్రీకాంత్, ప్రకృతి ప్రేమికులు మల్లేష్ గురూజీ, రాజేంద్రప్రసాద్, కెహెచ్. ప్రసాద్, జినుగు బాలశౌరి, నాగసీతారాములు, ముస్తఫా, విజరు, గుగులోత్ ధర్మ, విమల్ గురూజీ, ముత్యాల రాజేష్, కుమార్, జంపన్న తదితరులు పాల్గొన్నారు.