Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వతెలంగాణ-దుమ్ముగూడెం
సామాజిక సేవలో మేము సైతం అంటూ కోవిడ్ రెండవ దశ కరోనా రోగులకు అపన్నహస్తం అందిస్తూ, రక్త దానం చేయండి ప్రాణ దాతలు కండి అనే నినాదంతో పలు సేవా కార్యక్రమాల్లో ముందుంటున్న పృద్వీ ఆర్మీ హెల్ప్ ఆర్గనైజేషన్ తమ సేవలను డివిజన్ వ్యాప్తంగా విస్తృతం చేస్తోంది. అందులో భాగంగా సోమవారం కె.లకీë్మపురం గ్రామానికి చెందిన కనుబద్ది పద్మ అనే మహిళ బ్లెడ్ లెవెల్స్ తగ్గి భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆ మహిళకు ఏబీ పాజిటివ్ రక్తం అత్యవసరం కావడంతో దుమ్ముగూడెం మున్నూరుకాపు సంఘం మండల కన్వీనర్ పూదోట సూరిబాబు ద్వారా విషయం తెలుసుకున్న పృధ్వీ ఆర్మీ హెల్ప్ ఆర్గనైజేషన్ ఫౌండర్ బొల్లి పృద్వీరాజ్, కన్వీనర్ కుమ్మరికుంట సాంబశివరావులు వెంటనే స్పందించి ఆర్గనైజేన్ సభ్యుడు సారపాక ప్రగతి ట్రాన్స్ పోర్టులో పని చేస్తున్న శ్రీకాంత్‌ని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి పంపించి రెండు యూనిట్లు రక్తాన్ని రోగికి అందజేశారు. ఈ సందర్బంగా రోగి కుటుంబ సభ్యులు పృద్వీ ఆర్మీ హెల్ప్ ఆర్గనైజేషన్ నిర్వహకులకు అభినందనలు తెలియజేశారు.