Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దమ్మపేట
ప్రొఫెసర్ జయశంకర్ వర్థంతి సందర్భంగా సోమవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జయశంకర్ విగ్రహానికి అశ్వారావుపేట నియోజకవర్గం శాసన సభ్యుల మెచ్చా నాగేశ్వరరావు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, ఎల్ఎస్సీఎస్ చైర్మెన్ రావు జోగేశ్వరరావు, ఆత్మకమిటీ చైర్మన్ కెవి సత్యనారాయణ, వైస్ ఎంపీపీ దారా మల్లిఖార్జునరావు, ఏఎంసీ వైస్ చైర్మన్ అచ్యుతరావు, మండల టీఆర్‌యస్ పార్టీ అధ్యక్షులు దొడ్డాకుల రాజేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి రమేష్, సర్పంచ్ చిన వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
25 మంది కరోనా బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు వితరణ
జయశంకర్ వర్థంతి సందర్భంగా మండలంలోని మొండివర్రె, శ్రీరాంపురం గ్రామ పంచాయతీలలో కరోనా బారినపడి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న 25 కుటుంబాలకు మందలపల్లి గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్, ఫీడ్ ద నీడ్ స్వచ్ఛంద సంస్థ చైర్మన్ గారపాటి సూర్యనారాయణ, అనురాధ దంపతులు నిత్యావసర వస్తువులు, కోడిగుడ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు జారె ఆదినారాయణ, మొండివర్రె గ్రామ సర్పంచ్ రేణుక, సెక్రటరీ నాగమణి, ఎంపీటీసీ శివ, ప్రధానోపా ధ్యాయులు మస్తాన్‌వలీ, తెరాస నాయకులు నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
అశ్వారావుపేట : జయశంకర్ వర్ధంతిని సోమవారం అశ్వారావుపేటలో ఘనంగా నిర్వహించారు. స్థానిక జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఉన్న జయశంకర్ విగ్రాహానికి ఉద్యమ కర్త ముబారక్, సీఐ ఉపేందర్‌రావు, ఎస్ఐ అరుణలు నివాళులు అర్పించారు. మండల పరిషత్ ఆధ్వర్యంలో ఆ కార్యాలయంలో ఎంపీపీ శ్రీరామమూర్తి, సిబ్బంది శ్రద్దాంజలి ఘటించారు.
పేరాయిగూడెం పంచాయతీ ఆధ్వర్యంలో ఆ కార్యా లయంలో సర్పంచ్ సుమతి, కార్యదర్శి శ్రీరామమూర్తి, సిబ్బంది పుష్పాంజలి తెలిపారు. ప్రొఫెసర్ జయ శంకర్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో అధ్యక్షులు మృత్యుంజ యుడు (వాసు), క్లబ్ సభ్యులు నివాళులు అర్పించారు.
చర్ల : ఆరు దశాబ్దాల తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి ప్రదాత, తన జీవితాంతం స్వరాష్ట్ర సాధన కోసం తపించిన తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ సార్ అని టీఆర్ఎస్ మండల అధ్యక్షులు సోయం రాజారావు అన్నారు. సోమవారం జయశంకర్ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ క్రమశిక్షణ కలిగి బడుగు బలహీన వర్గాల అభ్యుదయానికి అనునిత్యం పాటుపడిన జయశంకర్ సార్ మనలో భౌతికంగా లేకపోయినా ఆయన ఆశయాలు రాష్ట్రానికి చేసిన కృషి మనలోనే ఉన్నాయని గుర్తు చేశారు. మండల టీఆర్ఎస్ పార్టీ నాయకులు సర్పంచ్ కాపుల కృష్ణార్జున రావు, అధికార ప్రతినిధి సయ్యద్ అజీజ్, రైతు బందు సమితి అధ్యక్షులు తోటపల్లి మాధవరావు, పీఏసీఎస్ డైరెక్టర్ పందిళ్లపల్లి రాధాకృష్ణ, బీసీ సెల్ అధ్యక్షులు దొడ్డి సూరిబాబు, టీఆర్ఎస్ నాయకులు పోలిన లంక రాజు, రాము, నరసింహమూర్తి యూత్ నాయకులు కాకి అనిల్, సోషల్ మీడియా ఇన్చార్జ్ పంజా రాజు తదితరులు పాల్గొన్నారు.
బూర్గంపాడు : జయశంకర్ వర్ధంతి సందర్భంగా మండల పరిషత్ కార్యక్రమంలో జయశంకర్ చిత్రపటానికి జెడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పోడియం ముత్యాలమ్మ, ఎంపీడీఓ వివేక్ రామ్ మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గోపిరెడ్డి రమణారెడ్డి, ఏపీవో శ్రీలక్ష్మి ఏఈ వెంకటేశ్వర్లు, తెలంగాణ ఉద్యమ నాయకులు పోడియం నరేందర్, మండల పరిషత్ సిబ్బంది విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఇల్లందు : రాష్ట్రసాధన కోసం దిశానిర్దేశం చేసి, రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని అంకితం చేసిన జయశంకర్ ధన్యజీవి అని ఎమ్మెల్యే హరిప్రియ, మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లు అన్నారు. క్యాంప్ కార్యాలయంలో సోమవారం జయశ ంకర్ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బానోత్ హరిసింగ్, వైస్ చైర్మన్ లాల్ సింగ్, మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర రావు, వైస్ చైర్మన్ జానీ పాషా, మండల ప్రధాన కార్యదర్శి రవి, పట్టణ ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరావు, పాల్గొన్నారు.
చండ్రుగొండ : మండల పరిషత్ కార్యాలయంలో జయశంకర్ వర్ధంతిని ఎంపీపీ బానోత్ పార్వతి ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షులు సత్యనారాయణ, మండల పంచాయతీ ఆఫీసర్ తులసి రామ్, జిల్లా కౌన్సిల్ సభ్యులు రసూల్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు భోజ నాయక్ తదితరులు పాల్గొన్నారు.