Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో సోమవారం డీపీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం డీపీఓ రమాకాంత్కి కనీస వేతనం రూ.19 వేలు ఇవ్వాలని, ఇన్సెంటివ్ చెల్లించాలని, మల్టీ పర్పస్ విధానం రద్దు చేయాలని తదితర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రం అందజేశారు. అనంతరం జరిగిన సభలో గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొండపల్లి శ్రీధర్ మాట్లాడారు. వీరికి కేవలం రూ.8,500లు మాత్రమే ఇస్తున్నారని మల్టిపుల్ పనివిధానం పేరుతో బానిసలాగా పని చేపిస్తున్నార ఆగ్రహం వ్యక్తంచేశారు. రూ.20 లక్షల ఇన్సూరెన్స్ అమలు చేయాలని, వీక్లీ ఆఫ్ ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా జూన్ 22, 23, 24 తేదీలలో డిమాండ్ బ్యాడ్జీలతో నిరసన, జూన్ 28, 29, 30 తేదీలలో అన్ని మండలాల్లో రిలే నిరాహార దీక్షలు చేయాలని, జూలై 5వ తేదీన కలెక్టర్ కార్యాలయం ముట్టడి సిద్ధపడాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో జిపి వర్కర్స్ యూనియన్ నాయకులు వెంకన్న, సింగ్, నాగయ్య, రాము, ధనలక్ష్మి, వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.