Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పర్స-మంచి కంటి హెల్ప్ లైన్ కన్వీనర్ మచ్చ
నవతెలంగాణ-కొత్తగూడెం
కరోనా కష్టకాలంలో కోవిడ్ బాధితుల కోసం ప్రతీ ఒక్కరూ అండగా నిలవాలని, అరోగ్య వంతమైన సమాజాన్ని నిర్మించాలని పర్స-మంచి కంటి హెల్ప్ లైన్ కన్వీనర్ మచ్చ వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం కొత్తగూడెం ప్రభుత్వ ఏరియా అసుపత్రిలో ఎస్ఎఫ్ఐ పూర్వ విద్యార్ధులు, పర్సా-మంచికంటి హెల్ప్ లైన్ అధ్వర్యంలో బొప్పాయి పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పర్సా-మంచి కంటి హెల్ప్ లైన్, భారత విద్యార్ది ఫెడరేషన్ (ఎస్ఎప్ఐ) పూర్వ విద్యార్థుల అధ్వర్యంలో కరోనా బాధితులకు పౌష్ఠిక ఆహారం అయిన బొప్పాయి పండ్లను పంపిణీ చేయటం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే.రమేష్, హెల్ప్ లైన్ సభ్యులు జాటోత్ కృష్ణ, భూక్యా రమేష్, నందిపాటి రమేశ్, రవి, నాగేశ్వరావు, చంటి, పిల్లి నాయుడు, సీతారాములు తదితరులు పాల్గొన్నారు.