Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం
- ఖమ్మం ప్రభుత్వాస్పత్రిలో మరియమ్మ కుమారుడికి పరామర్శ
నవతెలంగాణ- ఖమ్మం
యాదాద్రి భువనగిరి జిల్లా పోలీసుల అదుపులో మృతి చెందిన మరియమ్మ మృతికి కారకులైన పోలీసులపై హత్య కేసు నమోదు చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒక చోరీ కేసులో యాదాద్రి భువనగిరి జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకోగా ఖమ్మం జిల్లా చింతకాని మండలం కోమట్ల గూడెంకి చెందిన మరియమ్మ మృతిచెందగా ఆమె కుమారుడు ఉదరు కిరణ్ తీవ్రగాయాలతో ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతుండగా సీపీఐ(ఎం) బృందం మంగళవారం ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా పొన్నం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మరియమ్మ మృతి కేసును తప్పుదారి పట్టించి ఆమె మరణానికి కారణమైన వారిపైనా, ఆమె కుమారుడిని తీవ్రంగా గాయపరిచిన పోలీసులపైనా హత్య కేసు నమోదు చేయాలన్నారు. పోలీసులు చేస్తున్న దాష్టీకాలు కట్టడి చేయకపోతే మరో ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు. మరియమ్మ కుటుంబానికి ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం తో పాటు కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో సిపిఎం చింతకాని మండల కార్యదర్శి మడి పల్లి గోపాల్ రావు, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి నందిపాటి మనోహర్, మండల కమిటీ సభ్యులు వత్సవాయి జానకి రాములు, రాచ బంటి రాము,షేక్ మౌలా తదితరులు పాల్గొన్నారు