Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాధిత కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి
- కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నందిపాటి మనోహర్
నవతెలంగాణ-ఖమ్మం
చింతకాని మండలం కోమట్లగూడెం గ్రామానికి చెందిన దళిత కుటుంబంపైన యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీస్ స్టేషన్లో దొంగతనం కేసు మోపబడి అంబడిపూడి మరియమ్మ అనే మహిళ పోలీస్ స్టేషన్ లో లాకప్ డెత్ కు గురైన ఘటన పైన ప్రభుత్వం తక్షణమే విచారణ జరిపించి సంబంధిత బాధ్యులపైన ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసుతో పాటు హత్యానేరం కేసులను నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని, అతికిరాతకంగా దాడికి గురైన బాధితుడైన ఉదరు కిరణ్ కు మెరుగైన వైద్యం అందించాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) జిల్లా ప్రధాన కార్యదర్శి నందిపాటి మనోహర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక ప్రభుత్వ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బాధితుడైన ఉదరు కిరణ్ ను కెవిపిఎస్ జిల్లా బృందంతో వెళ్లి పరామర్శించారు. కార్యక్రమంలో కెవిపిఎస్ పట్టణ నాయకులు గద్దల వీరబాబు, గద్దల అనిల్, పి.సత్యనారాయణ, ఎన్.కృష్ణ తదితరులు పాల్గొన్నారు.