Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనా మృతులకు అంత్యక్రియలు
నవతెలంగాణ-జూలూరుపాడు
సహాయం, సేవ చేయడమే తన లక్ష్యంగా పెట్టుకొని చేతనైన సహాయం చేయడం ఆయన లక్ష్యం మనకు సహజంగా నడవలేని వారికీ వీల్ చైర్లు, పేదరికంలో ఉన్నవారికి ఆర్ధికంగా సహాయం చేయడం మనం చుస్తున్నే ఉంటాం. కానీ కరోనా వైరస్ సోకి మృతి చెందిన వ్యక్తికి అంతేక్రియలు చేయడానికి సొంత కుటుంబ సభ్యులు, తోటి వారు, మిత్రులు, బంధు వులు ఎవరూ రాని పరిస్థితుల్లో మండల వాసు లకు అండగా మేమున్నామంటూ కరోనా మృతులకు అంత్య క్రియలు నిర్వహించడంలో సీపీఐ మండల నాయకుడు షేక్ నాగుల్‌మీరా ముందుంటున్నారు. దీంతో వారి సేవలను మండల ప్రజలు అభినందిస్తున్నారు.
మరిన్ని విషయాలు ఆయన మాటల్లో
తన రాజకీయ గురువు అయిన సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషాను ఆదర్శంగా తీసుకొని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. తనతో పాటు తన మిత్రబృందం అయిన సమీర్, అఖిల్, పవన్, ఖాసిం, కిరణ్, నరేష్ తనకు సహకరించడంతో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుకు వెళుతున్నట్టు తెలిపారు. మండలంలో అన్ని తానై నిరుపేదలకు, కరోనాతో బాధపడుతున్న కుటుంబాలకు నిత్యవసర వస్తువులు, కూరగాయలు, బియ్యం, మాస్కులు, కోడిగుడ్లు పంపిణీ చేస్తూ వారికీ ధైర్యంగా ఉండాలని చెప్పి బరోసా ఇస్తూ తన దైన శైలిలో సమాజ సేవ చేస్తున్నాడు.
షేక్ నాగుల్ మీరా తన సేవా బృందం చేస్తున్న కార్యక్రమాలు చూసి మండల కాంగ్రెస్ పార్టీ నాయ కులు పోన్నికేంటే వీరభద్రరావు, కాకర్ల ఎంపీటీసీ పోన్నికంటే సతీష్, అదేవిధంగా వెంకగన్నపాలెం సర్పంచ్ గలిగే సావిత్రి పలువురు శాలువాలతో సత్కరించి సన్మానం చేసి అభినందించారు.