Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి
- కార్మికులకు అండగా మేము సైతం
- సింగరేణి డీవైసీఎంఓ మేరికుమారి
నవతెలంగాణ-మణుగూరు
సిరుల తల్లి సింగరేణి మణుగూరు ఏరియా ఆసుపత్రి కోవిడ్-19 నియంత్రించడంలో ఆగ్రస్థానంలో నిలిచింది. 2020-21 బొగ్గు, ఉత్పత్తి ఉత్పాదకతలో 6 సింగరేణి జిల్లాలోని 11 ఏరియాల్లో మణుగూరుదే ప్రథమ స్థానం. కోవిడ్-19 సెకండ్ వేవ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతంగా ప్రజలతో చేలగాటమాడుతున్న సమయంలో సింగరేణి కార్మికులకు మేము అండగా వుంటామంటూ... సింగరేణి ఏరియా ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది అలుపెరగని పోరాటం చేస్తూ తమను తాము రక్షించుకుంటూ కరోనా బాధితులకు వైద్యం అందిస్తున్నారు. వ్యాక్సినేషన్లో కూడా వందశాతం పూర్తి చేసి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. కోవిడ్-19 ఫస్ట్ వేవ్ కన్నా సెకండ్ వేవ్ ఎక్కువ ప్రభావం చూపిన కార్మికుల ఆత్మస్థైర్యం, ధృడ సంకల్పం కల్గి వుండడంతో తక్కువ కేసులు నమోదు అయ్యాయి. దీని గల కారణం కార్మికులకు ఆసుపత్రి వైద్యులు అవగాహన కల్పించడమే. కార్మికులు, కార్మిక సంఘాలు మరియు ఏరియా అధికారులు కలిసి వైద్యులు చేస్తున్న సేవలకు ప్రశంసలు కురిపిస్తు న్నారు. థర్డ్ వేవ్ వస్తుందని అంతర్జాతీయ, జాతీయ సంస్థలు చెప్తువున్నపటికీ మణుగూరు సింగరేణి ఏరియా ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది అందరూ ఫ్రంట్ లైన్ వారియర్‌గా ఎదుర్కొంటామని ఏరియా ఆసుపత్రి డీవైసీఎంవో డాక్టర్ మేరికుమారి నవతెలంగాణకు తెలిపారు.
వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎంత శాతం సాధించారు?
మణుగూరు ఏరియాలో వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేశాం. సుమారు 2600 మంది కార్మికులకు, 2231 మంది కార్మికులకు ఫస్డ్ డోస్ పూర్తి చేసి, 270 మందికి సెకండ్ డోస్ పూర్తి చేశాం. మొత్తం 3,893 మందికి వ్యాక్సినేషన్ ప్రకియ పూర్తి అయింది.
కోవిడ్-19 రాపిడ్ టెస్టులు ఎన్ని నిర్వహించారు?
కార్మికులు, కార్మిక కుటుంబాలకు, క్యాసువల్ లేబర్‌కి 3879 మందికి టెస్టులు నిర్వహించాం. ఇందులో పాజిటివ్ 833 మందికి వచ్చింది. 3153 మందికి నెగిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఐసోలేషన్‌లో 24 గంటలు పాటు వైద్యుల పరివేక్షణలో ఉచిత చికిత్స అందిస్తున్నాము.
ఐసోలేషన్‌లో ఏర్పాటు ఎలాగ వున్నాయి?
ఐసోలేషన్‌లో కరోనా పాజిటివ్ బాధితులకు అనుకూలంగా ఆక్సిజన్, బెడ్స్ అందుబాటులో వున్నాయి. బాధితులకు ఉదయం 8 గంటలకు టిఫిన్, మధ్యాహ్నాం 2 గుడ్లు, కర్రి, దాల్ అందిస్తున్నాము. ఉదయం 11 గంటల తరువాత రాగిజావ అందిస్తున్నాము. రాత్రి భోజనంలో ఒక గుడ్డు, కర్రి, దాల్, సాంబరు ఏర్పాటు చేస్తున్నాము. బాధితులకు పౌష్టికాహారం అందించడం జరుగు తుంది. సింగరేణి కార్మికులు, కార్మిక కుటుంబాలు, కాంట్రాక్ట్ కార్మికులు ఐసోలేషన్‌లో వుంచుతున్నాము. బాధితులు త్వరగా కోలుకొని ఇంటికి వేళ్లే విధంగా ఐసోలేషన్ కేంద్రంలో అన్ని సౌకర్యాలు ఉన్నాయి.