Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భద్రాచలంలో 20 పునరావాస కేంద్రాలు
- సమీక్షా సమావేశంలో కలెక్టర్ అనుదీప్
నవతెలంగాణ-భద్రాచలం
గోదావరి వరదల నుండి ప్రజలను రక్షించేందుకు శాఖల వారిగా కేటాయించిన పనులను పూర్తి చేసి జూలై మొదటి వారంలో నిర్వహించనున్న మాక్ డ్రిల్క్కు పూర్తిస్థాయిలో సంసిద్ధంగా ఉండాలని కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. మంగళవారం భద్రాచలం సబ్ కలెక్టరేట్ సమావేశపు హాలులో గోదావరి వరదలపై అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
లోతట్టు ప్రాంతాల ప్రజలను ముంపు నుండి కాపాడేందుకు పట్టణంలో 20 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. పునరావాస కేంద్రాలలో ఏర్పాట్లు ప్రక్రియను ఆయా మండలాల తహసీల్దారులు పర్యవేక్షణ చేయాలని చెప్పారు. వరదల వల్ల ప్రజలకు నిత్యావసరాలు ఇబ్బంది రాకుండా నాలుగు నెలలకు సరిపోను స్టాకును ఆయా మండలాల్లో సిద్ధంగా ఉంచామని, స్టాకును ఆయా మండలాల తహసీ ల్దారులు పరిశీలన చేసి నివేదికలు అందచేయాలని చెప్పారు.
హెలికాప్టర్ సేవలు వినియోగంకు ఏర్పాట్లు
అత్యవసర సమయాల్లో హెలికాఫ్టర్ సేవలు వినియోగించుకునేందుకు వీలుగా హెలిప్యాడ్లు ఏర్పాటు చేయాలని ర.భ.అధికారులకు కలెక్టర్ అనుదీప్ సూచిం చారు. నాటు పడవలను సిద్ధంగా ఉంచడంతో పాటు ప్రతిరూటుకు ఏఈని పర్యవేక్షణ అధికారిగా నియమిం చాలని చెప్పారు. అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు న్నందున ఆయా ప్రాంతాల్లో వైద్య కేంద్రాలు నిర్వహణతో పాటు ప్రతి ఏయన్యం, ఆశా వద్ద అత్యవసర వైద్య కిట్లు అందుబాటులో ఉంచాలని ఆయన అన్నారు. దోమలు వ్యాప్తిని నిరోధించేందుకు నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో ఆయిల్ బాల్స్ చేయడంతో పాటు ఫాగింగ్ చేయాలని చెప్పారు. గర్భిణి మహిళలను ముందస్తుగా ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు తరలించాలని చెప్పారు. పట్టణంలోని విస్తా కాంప్లెక్సు, కొత్తకాలనీ, అశోక్ నగర్ కాలనీల్లో చేరిన నీరును తొలగించేందుకు మోటార్లు ఏర్పాటు చేయాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు.
విద్యుత్ సమస్య వస్తే ఇతర ఫీడర్లు నుండి విద్యుత్తు అందించు విధంగా చర్యలు తీసుకోవాలని విద్యుత్ అధికారులకు సూచించారు. విద్యుత్ పోల్స ఆడిట్ నిర్వహించాలని తహసిల్దారులను ఆదేశిం చారు. దుమ్ముగూడెంలో నూతన సబ్ స్టేషన్ ఏర్పాటుకు 4 ఎకరాల స్థలాన్ని గుర్తించి శనివారం వరకు నివేదికలు అందచేయాలని తహసిల్దారును ఆదేశించారు. ముందస్తుగా సీసీ రోడ్లు లేని రహదారులను గుర్తించి ఎంపీడీఓ, తహరసీల్దారులు పీఆర్ ఇంజనీరింగ్ అధికారుల దృష్టికి తెచ్చి బురదలు లేకుండా చర్యలు చేపట్టాలని చెప్పారు.
పంటల సాగు వివరాలను తప్పని సరిగా ఆన్లైన్ చేయాలని ఆయన సూచించారు. మంచినీటి సమస్య ఉన్న గ్రామాల్లో సమస్యను పరిష్కరించేందుకు ట్యాంకర్లు ఏర్పాటు చేయాలని, ఏఈలను ప్రత్యేక అధికారులుగా నియమిం చాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నీటి పంపులకు ఏర్పాటు చేసిన నల్లాలను తొలగించే వ్యక్తులకు జరిమానా విధించాలని చెప్పారు. వరద సమాచారాన్ని ప్రజలకు తెలుసుకోవడానికి వీలుగా భద్రాలచం సబ్ కలెక్టరేట్లో 08743-232444 నెంబరుతో 24 గంటలు పనిచేయు విధంగా కంట్రోల్ రూము ఏర్పాటు చేయాలని సబ్ కలెక్టర్కు సూచించారు. వరదలకు పశువులు ప్రమాదానికి గురికాకుండా పునరా వాస కేంద్రాలు ఏర్పాటు చేయుటకు ప్రణాళికలు తయారు చేయాలని పశుసంవర్ధక అధికారిని ఆదేశించారు. సిబ్బంది జాబితా ఆయా మండలాల తహసీల్దారుల వద్ద అందుబా టులో ఉంచాలని చెప్పారు. ఈ సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఏఎస్పీ డాక్టర్ వినీత్, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.