Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐసోలేషన్ కేంద్రకు భవనం కేటాయించాలని కలెక్టర్‌కు వినతి
నవతెలంగాణ-భద్రాచలం
కరోనా ఉచిత ఐసోలేషన్ కేంద్రానికి సంపూర్ణ సహకారం చేసిన కలెక్టర్ అనుదీప్‌కి బండారు చంద్రరావు ట్రస్ట్ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం భద్రాచలంలో కలెక్టర్‌ను కలిశారు. విద్యా సంస్థలు ప్రారంభమవుతున్న నేపధ్యంలో ఐసోలేషన్ కేంద్రం నిర్వాహణకు ఏదైనా ప్రభుత్వ భవనం కేటాయించాలని కలెక్టర్‌కి వినతి పత్రం ట్రస్టు నిర్వాహకులు ఇచ్చారు. ఈ నెల 8న ప్రారంభమైన కరోనా ఉచిత ఐసోలేశన్ కేంద్రంలో మొత్తం 46 మంది చేరారని, వీరిలో 21 మంది సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని కలెక్టర్‌కు తెలిపారు. ప్రస్తుతం 25 మంది కరోనా పేషంట్స్ ఉన్నారన్నారు. వీరి కోసం పౌష్టికాహారం అందిస్తున్నామని తెలిపారు. పట్టణ ప్రముఖ వైద్యులు డాక్టర్ పవన్ కుమార్ సారధ్యంలో డాక్టర్స్ రామకృష్ణ, చైతన్య, క్రాఫా విజరులు నిత్యం పేషంట్స్ని చెకప్ చేస్తూ, వారి రీడింగ్‌లను పరిశీలిస్తూ, తగిన గైడెన్స్ ఇస్తున్నారన్నారు. పట్టణం లో అన్ని వర్గాల వారు అన్ని విధాలుగా సహకరి స్తున్నారని తెలిపారు. వినతిపత్రానికి స్పందించిన కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం ఐసోలేషన్ కేంద్రంలో ఉన్న పేషంట్స్‌కి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా తగిన ఏర్పాట్లు చేద్దామని, ప్రభుత్వ హాస్పటల్లో ఒక వార్డ్ కేటాయిస్తామని హామీ ఇచ్చారు. కలెక్టర్‌ని కలిసిన ప్రతినిధి బృందంలో ట్రస్ట్ నిర్వాహకులు ఏజే. రమేష్, గడ్డం స్వామి, యం.బి.నర్సారెడ్డి, భీమవరపు వెంకటరెడ్డి, బండారు శరత్ బాబు ఉన్నారు.