Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బోగాల శ్రీనివాస రెడ్డి
నవతెలంగాణ-భద్రాచలం
గ్రీన్ భద్రాద్రి నూతన కమిటీ మొదటి సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో నూతన అధ్యక్షులు బోగాల శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ, గత పది సంవత్సరాలుగా గ్రీన్ భద్రాద్రి భద్రాచలంలో అత్యధికంగా మొక్కలు నాటి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందదని పేర్కొన్నారు. అటువంటి గ్రీన్ భద్రాద్రికి అధ్యక్షులుగా నియమించటం చాలా గర్వించదగ్గ విషయమని అన్నారు. ఈ సంవత్సరం అత్యధిక మొక్కలు నాటి భద్రాచలాన్ని పచ్చని భద్రాద్రిగా మారుస్తానని, గ్రీన్ భద్రాద్రి పెద్దలు ఉంచిన బాధ్యతను, సభ్యులు, పర్యావరణ ప్రేమికులు, పట్టణ ప్రముఖుల సహాయ సహకారాలతో గ్రీన్ భద్రాద్రికి మరింత ఖ్యాతి తెచ్చేలా కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ 2021-22 సంవత్సరానికి, మొక్కలు నాటుటకు అనువైన స్థల సేకరణ, ఆర్థిక వనరులు సమీకరణ చేయాలని కోరారు. కడియపు లంక నుండి మొక్కల మొక్కలు కొనుగోలు, ఎదిగిన మొక్కలకు ఉన్న ఇనుప ట్రీగార్డ్స్ను తీసి కొత్తగా నాటిన వాటికి తిరిగి ఉపయోగించుట తదితర భవిష్యత్ కార్యచరణపై సుదీర్ఘంగా చర్చించారు.
గ్రీన్ భద్రాద్రి 2021-22.సంవత్సరానికి ఆర్థిక సమీకరణలో భాగంగా విరాళాలు
జిఎస్ శంకర్ రావు రూ.10000, పల్లింటి దేశప్ప రూ. 5000,గంగాధర వీరయ్య రూ.5000,భీమవరపు వెంకటరెడ్డి రూ. 5000, గోళ్ళ భూపతిరావు రూ. 5000, గౌతమీ స్పైస్, ఆర్. రామకృష్ణారెడ్డి రూ.5000, భాష్యం రామకృష్ణారెడ్డి రూ. 5000 లు అందజేశారు.
ఈ కార్యక్రమంలో గ్రీన్ భద్రాద్రి కార్యదర్శి పామరాజు తిరుమల రావు, కోశాధికారి ఉప్పాడ ప్రసాద రెడ్డి, గ్రీన్ భద్రాద్రి వ్యవస్థాపకులు బొలిశెట్టి రంగారావు, జి. రాజారెడ్డి, గౌరవాధ్యక్షులు జి.యస్. శంకర్ రావు యేగి సూర్య నారాయణ, పల్లింటి దేశప్ప, గోళ్ళ భూపతి రావు, భోణాల నాగ సూర్య నారాయణ, ఉపాధ్యక్షులు కామిశెట్ట కృష్ణార్జున రావు, బెల్లంకొండ రాంబాబు, భీమవరపు వెంకట రెడ్డి, ఉమా శంకర్ నాయుడు, గంగాధర వీరయ్య, పరిమి సోమ శేఖర్, కృష్ణ మోహన్, వీధుల రాంబాబు, తంగేటి కృష్ణ, సంయుక్త కార్యదర్శి శీలం రామ్మోహన్ రెడ్డి, రాము, అన్నెం వెంకటేశ్వర రెడ్డి, రామరాజు, శ్రీదేవి, రాణి తదితరులు పాల్గొన్నారు..