Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రముఖ పర్యావరణవేత్త కె. పురుషోత్తమరెడ్డి
నవతెలంగాణ-ఖమ్మం
మనిషితోపాటు భూమిపై ప్రతిపాణకోటి మనుగడకు ''పర్యావరణం సమతుల్యత అత్యంత ప్రాధాన్యత కల్గిన అంశమని, ఇంత ప్రాధాన్యత కల్గిన ఈ విషయానికి ప్రభుత్వాలు (ప్రపంచ దేశాల) అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరముందని, ఇప్పటికే చేసిన ఐక్యరాజ్యసమితి తీర్మానాలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరముందని ప్రముఖ పర్యావరణవేత్త ప్రోపెసర్, డాక్టర్ కె. పురుషోత్తమరెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక్ సుందరయ్య భవనంలో తెలంగాణ అర్బన్ డెవలప్ట్మెంట్ ఫోరం (టీయూడిఎఫ్) ఖమ్మం జిల్లా కమిటీ కన్వీనర్ యర్రా శ్రీనివాసరావు అధ్యక్షతన ఆన్లలైన్ ''వెబినార్'' ''పర్యావరణ ప్రాముఖ్యత - ప్రభుత్వ విధానాలు'' అంశంపై నిర్వహించారు. ఈ సందర్భంగా పురుషోత్తమ రెడ్డి మాట్లాడుతూ పెరిగిన విశకలా పెట్టుబడిదారి విధానం'' 99 శాతం పర్యావరణ సమతుల్యతను దెబ్బతీయటం జరుగుతుంతున్నారు. లాభాపేక్ష ధ్యేయంతో అనేక రకాల కాలుష్పాలకు తద్వారా విశ్వంపై జీవకోటి మనుగడ ను తీవ్ర ప్రమాదంలోకి నెడుతుందన్నారు. రైతు సంఘం రాష్ట్ర నాయకులు నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ దేశంలో పార్లమెంట్ చట్టాలు పరిరక్షణలో, పర్యావరణ పరిక్షణ కోసం తగ్గిన బడ్జెట్ కేటాయించడంలో, రాష్ట్రాలు జరుగుతున్న ద్వంసాన్ని కాపాడటం లో పూర్తిగా విఫలమైయిందనారు.