Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్
- మంచికంటి పర్సా-హెల్ప్‌లైన్ ఆధ్వర్యంలో సేవలు
నవతెలంగాణ-కొత్తగూడెం
కరోనాతో చనిపోయిన కుటుంబాలకు నాలుగు లక్షల సహాయం అందించాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రం ప్రభుత్వ హాస్పిటల్లో జాస్తి రాధాకృష్ణ మూర్తి వర్ధంతి సందర్భంగా కరోనా చికిత్స పొందుతున్న రోగులకు మంచికంటి పర్సా హెల్ప్‌లైన్ ఆధ్వర్యంలో పౌష్ఠిక ఆహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుప్రీం కోర్టు ఆరోగ్య విపత్తు కింద కరోనాతో చనిపోయిన కుటుంబాలకు రూ.4లక్షలు సహాయం చేయాలని సూచన చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. కరోనా వచ్చిన వారి దగ్గరికి కుటుంబ సభ్యులే దగ్గరికి రాని పరిస్థితుల్లో మంచికంటి పర్సా హెల్ప్ లైన్ సభ్యులు రోగులను పరామర్శించడం వారికి తగిన సహాయంగాఉండడం గర్వకారణం అన్నారు. ప్రభుత్వం నుండి సరైన సౌకర్యాలు అందుబాటులో ఉన్నా లేకున్నా డాక్టర్లు, నర్సులు శానిటేషన్ వర్కర్ల కషి చాలా అభినందనీయం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.సాయిబాబు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మచ్చా వేంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు అన్నవరపు కనకయ్య, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లిక్కి బాలరాజు, ఐద్వా జిల్లా నాయకురాలు సందకూరి లక్ష్మి, సీఐటీయూ నాయకులు భూక్యా రమేష్, జునుమాల నగేష్, కేవిపియస్ నాయకులు నందిపాటి రమేష్, కెహెచ్.ప్రసాద్, ఎస్ఎఫ్ఐ మాజీ నాయకులు జాస్తి రమేష్, అనురాధ, మైనేని మోహన్, మన్నెం జవహర్ రెడ్డి, జునుమల వంశీ, రవి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.