Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాదాసీదాగా మండల పరిషత్ సర్వసభ్య సమావేశం
నవతెలంగాణ-దుమ్ముగూడెం
మండల పరిషత్ సర్వసభ్య సమావేశం బుధవారం ఎంపిపి రేసు లక్ష్మి అధ్యక్షతన మండల పరిషత్ సమావేశపు మందిరంలో జరిగింది. ముందుగా వ్యవశాయ శాఖ అధికారి నవీన్ మాట్లాడుతూ.. మండల రైతులు నకిలీ విత్తనాలు, ఎరువుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. విత్తనాలు కొనుగోలు చేసినప్పుడు తప్పని సరిగా వ్యాపారి వద్ద నుండి బిల్లులు తీసుకోవాలన్నారు. మండల రైతులు అపరాల సాగుపై దృష్టి సారించాలన్నారు. సీతారాంపురం ఎంపీటీసీ యలమంచి వంశీకృష్ణ మాట్లాడుతూ ఆర్ఓఎఫ్ఆర్ చట్టం ప్రకారం హక్కులు కలిగిన గిరిజన రైతులకు రైతు బంధు పథకం అందజేయాలని, పోడు భూములకు హక్కు పత్రాలు అందజేయాలన్నారు. ప్రభుత్వం సన్నరకం వంగడాలు, అపరాలు సాగు చేయాలని సూచిస్తున్ప్పప్పటికి వాటికి సరైన గిట్టు బాటు ధర రావడం లేదని సమావేశం దృష్టికి తీసుకు పోయారు. మిషన్ భగీరధ ఏఇ ప్రమోషన్ పై వెళితే ఇక్కడ పనులు పర్యవేక్షించే అధికారి లేరని చాలా గ్రామాలలో మిషన్ భగీరథ నీరు రావడం లేదని పలు గ్రామ పంచాయతీల సర్పంచ్లు సమావేశం దృష్టికి తీసుకు పోయారు. వైద్యాధికారి బాలాజీ నాయక్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారని, త్వరలో మండల వ్యాప్తంగా ఐఆర్ఎస్ స్ప్రేయింగ్ పనులు ప్రారంభించారని దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. మండలంలో కోవిడ్ 19 పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయన్నారు. మండల వ్యాప్తంగా 61 గ్రామాలలో ఇప్పటి వరకు 17 వేల 500 వందల దోమ తెరలు పంపిణీ చేశామన్నారు. విద్యుత్ శాఖ అధికారుల పని తీరు పట్ల సర్పంచ్లు మండి పడ్డారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రభలే అవకాశం ఉందని వైద్య సిబ్బంది నిత్యం అందుబాటులో ఉంటూ అప్రమత్తంగా ఉండాలని ఎంపీపీ రేసు లక్ష్మి అన్నారు. సమావేశంలో ఎంపిడిఓ ఎం. చంద్రమౌళి, మండల ప్రత్యేక అధికారి బి. చంద్ర ప్రకాశ్, ఎంపిఓ ముత్యాలరావు తో పాటు వివిద శాఖలకు చెందిన అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు..