Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చింతూరు మండలంలో ప్రమాదం
- హైదరాబాద్ ఆస్పత్రికి తరలింపు
నవతెలంగాణ- భద్రాచలం
భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ కోటిరెడ్డి రోడ్డు ప్రమాదంలో బుధవారం తీవ్రంగా గాయపడ్డారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కూనవరం ఆస్పత్రిలో సూపర్డెంట్గా పనిచేస్తున్న డాక్టర్ కోటిరెడ్డి చింతూరు మండలంలో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఈ మేరకు ఆయనను భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఇక్కడ ఆయనకు వైద్య చికిత్సలు అందించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాదు కు తరలించారు. ఏపీలోని చింతూరు మండలం ఒడ్డుగూడెం గ్రామం వద్ద వీరు ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో గౌరిదేవి పేటకు చెందిన పిహెచ్సి డాక్టర్‌కు కూడా గాయాలైనట్లు సమాచారం. డాక్టర్ కోటిరెడ్డి గత ఏడాది తెలంగాణ రాష్ట్రం వైద్య శాఖ నుంచి బదిలీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖకు బదిలీ అయ్యారు.