Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సేవ్ ఇండియా.... సేవ్ అగ్రికల్చర్...
- రైతు సంఘం జిల్లా కార్యదర్శి మాదినేని రమేష్
నవతెలంగాణ-చింతకాని
సేవ్ ఇండియా.... సేవ్ అగ్రికల్చర్... పేరుతో జూన్ 26న దేశవ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమాలకు మద్దతుగా మండల కేంద్రాల్లో జరిగే నిరసన కార్యక్రమాలను జయప్రదం చేయాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి మాదినేని రమేష్ పిలుపునిచ్చారు. బుధవారం చింతకాని సీపీఐ(ఎం) కార్యాలయంలో జరిగిన రైతు సంఘం మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మూడు రైతు వ్యతిరేక చట్టాలను ,విద్యుత్ సవరణ బిల్లులను తెచ్చిందని 44 కార్మిక చట్టాలను, నాలుగు కోడ్ లుగా మార్పు చేసిందని వీటిని వెనక్కి తీసుకోవాలన్నారు. ప్రభుత్వం అధికారుల వైఫల్యం వల్లనే ఇప్పటికే జిల్లాలో నకిలీ విత్తనాలు భారీగా మార్కెట్లో కి వచ్చాయన్నారు. ప్రశ్నించే వారిపై దేశ ద్రోహం, రాజద్రోహం కేసులను బనాయిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో సీపీఎం మండల కార్యదర్శి మడిపల్లి గోపాల్ రావు, వ్యవసాయకార్మిక సంఘం నాయకులు వత్సవాయి జానకి రాములు, రైతు సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు మద్దిన్ని బసవయ్య, బల్లి వీరయ్య, నాయకులు నన్నక కృష్ణమూర్తి, తోటకూర వెంకట నరసయ్య, తిరుపతి అంజయ్య, శ్యామ్ సుందర్, మాదిన్న రవిబాబు, మడిపల్లి కిరణ్ బాబు తదితరులు పాల్గొన్నారు.