Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -కొత్తగూడెం
ఒక వ్యక్తి తన తల్లి గురించి దుర్భాషలాడాడని ఆవేశానికి గురైన యువకుడు మరో వ్యక్తి మర్మాంగాన్ని కోసిన సంఘటన మంగళవారం అర్ధరాత్రి భద్రాద్రికొత్తగూడెం చుంచుపల్లి మండలం రుద్రంపూర్ పంచాయతీలో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ మౌలాలికి చెందిన రుద్రారపు కార్తీక్ గత కొంత కాలంగా కొత్తగూడెంలో సేల్స్ మ్యాన్‌గా పని చేస్తున్నాడు. రుద్రంపూర్‌లోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయం ఆవరణలో ఉన్న షెడ్డులో తలదాచుకుంటున్నాడు. ఈ క్రమంలో రాత్రి రుద్రంపూర్‌కు చెందిన షేక్ పాషా మద్యం సేవించి కార్తీక్ ఉన్న ప్రాంతానికి వెళ్లాడు. అర్ధరాత్రి ఇక్కడ ఏం చేస్తున్నారంటూ ఒకరినొకరు వాగ్వివాదానికి దిగారు. ఈ క్రమంలో తాగిన మైకంలో ఉన్న పాషా కార్తీక్ తల్లిని దుర్భాషలాడాడు. ఆవేశానికి గురైన కార్తీక్ తన వద్ద ఉన్న కత్తితో పాషాపై దాడి చేశాడు. కింద పడిపోయిన పాషా మర్మాంగాన్ని కోసేశాడు. రక్తపుమడుగులో పడిఉన్న పాషాను చూసి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. నిందితుడు పోలీసులు అదుపులో ఉన్నాడు. పాషాకు మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా స్థానికంగా గంజాయికి బానిసైన పలువురు ఇలా వ్యవహరిస్తున్నట్టు, తరచూ గొడవలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. రామవరం టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.