Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
- నవచైతన్య ఆధ్వర్యంలో నిత్యావసరాలు పంపిణీ
నవతెలంగాణ- సత్తుపల్లి
లెఫ్ట్ నాయకుడిగా ఉభయ కమ్యూనిస్టులకు సలహాదారుడిగా వ్యవహరించి ఆదర్శవంతమైన జీవనం గడిపిన గండికోట కమలాకరరావు వ్యక్తిత్వం ఆదర్శమని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. కమలాకరావు జయంతి సందర్భంగా స్థానిక ప్రభుత్వాసుపత్రిలోని కోవిడ్ వ్యాధిగ్రస్తులకు, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు ఆయన కుమారుడు డాక్టర్ రమాకాంత్, కోడలు వసుమతీదేవి సౌజన్యంతో నవచైతన్య ఆధ్వర్యంలో బుధవారం మాంసాహార భోజనం, డ్రైఫ్రూట్స్, బియ్యం, నిత్యావసర సరుకులను ఎమ్మెల్యే సండ్ర చేతుల మీదుగా అందించారు. ఆసుపత్రికి పల్స్ ఆక్సిమీటర్లను అందించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ నీతీ, నిజాయితీ గల వ్యక్తిత్వంతో ఉంటూ ఆదర్శమైన జీవితం కమలాకరరావు గడిపారని కొనియాడారు.ఆయన ఉన్నత విలువలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. డాక్టర్ గండికోట రమాకాంత్ మాట్లాడుతూ తన తండ్రి బాటలోనే వామపక్ష భావజాలంతో ఇక్కడ వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. నిజాయతీ, నిబద్ధతతో నవచైతన్య సేవా సంస్థ అందిస్తున్న సేవలను గమనిస్తున్నామన్నారు. ఈ నేపధ్యంలో వారి ఆధ్వర్యంలో ఈ వితరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. నవచైతన్య అధ్యక్ష, కార్యదర్శులు గాదె నరసింహారెడ్డి, తోట కిరణ్ మాట్లాడుతూ రమాకాంత్ తండ్రి కమలాకరరావు జయంతి సందర్భంగా ఈరోజు సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. ఈ సందర్భంగా తమ సంస్థకు సేవా కార్యక్రమాల కొనసాగింపుకు డాక్టర్ రమాకాంత్ రూ. 10వేలు వితరణ చేశారన్నారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పాకలపాటి వసుమతీదేవి, మున్సిపల్ ఛైర్మెన్ కూసంపూడి మహేశ్, కౌన్సిలర్లు అద్దంకి అనిల్‌కుమార్, గుంట్రు రాఘవేంద్ర, సంస్థ డైరెక్టర్లు పుల్లారావు, జగదీశ్, సుధీర్, శ్రీను, యేసయ్య, ముస్తఫా, కార్తిక్, శివనాగరాజు, సునీల్, మారయ్య పాల్గొన్నారు.