Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పల్లె ప్రగతిలో ఆదర్శం ' బోనకల్'
నవతెలంగాణ- బోనకల్
అక్షరాలలో సున్నా.. కానీ అభివృద్ధి పనుల్లో మాత్రం మిన్న .. అమాయకత్వమే కానీ అహంకారం లేదు.. బోలా శంకరుడే గాని.. కక్షల కార్పాన్యాల తెలియవు.. ఎవరు ఏది చెప్పినా సరే అనడమే ఆయనకు తెలిసిన న్యాయం.. మంచి కోసం పిలిస్తే ఎంత దూరమైనా సొంత ఖర్చులతో వెళ్తాడు.. నమ్ముకున్న ప్రజల కోసం ఖర్చు గురించి ఆలోచించడు.. గ్రామ అభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్నారు. అందుకే రెండుసార్లు ఉత్తమ సర్పంచిగా ఎన్నికయ్యాడు ఆయనే మండల కేంద్రమైన బోనకల్ గిరిజన గ్రామ సర్పంచ్ భూక్య సైదా నాయక్. ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను సద్వినియోగం చేసుకొని ఆదర్శంగా నిలుస్తున్న గ్రామ పంచాయతీ బోనకల్. మండల కేంద్రమైన బోనకల్ గ్రామపంచాయతీ పల్లె ప్రగతి పనులను సకాలంలో పూర్తి చేసుకుని జిల్లాలో ఆదర్శంగా నిలిచింది. లక్షల రూపాయల వ్యయంతో పూర్తి చేసిన పనులు ప్రస్తుతం ప్రారంభోత్సవం కోసం ఎదురుచూస్తున్నారు. అభివృద్ధి పనుల్లో బోనకల్ పంచాయతీని ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దాడు. గ్రామ ప్రజల కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పనులను పూర్తి చేయడం విశేషం. ప్రస్తుతం కరోనా రెండోదశ నేపథ్యంలో గ్రామ ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ పారిశుద్ధ్య కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. గ్రామంలో సిసి రోడ్ల నిర్మాణం, తాగునీటి పథకాల ద్వారా ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా చూడటం, లక్షల రూపాయల వ్యయంతో వైకుంఠధామం, వర్మి కంపోస్టు షెడ్డు నిర్మాణం, డంపింగ్ యార్డ్ నిర్మాణం, పల్లె ప్రకతి వనం, రైతు వేదిక అభివృద్ధి పనులను పూర్తి చేశారు. అదేవిధంగా పలు వీధుల్లో మట్టి రోడ్ల నిర్మాణ పనులను చేపట్టారు. వీధుల వెంట ఆటోమేటిక్ లైట్లనిర్మాణం, కరోనా నేపథ్యంలో పారిశుద్ధ్య కార్యక్రమాలను అధిక ప్రాధాన్యం ఇస్తూ దోమల నివారణకు కీమో పాన్, తానే స్వయంగా మోటార్‌సైకిల్ నడుపుతూ వీధుల వెంట బ్లీచింగ్ పౌడర్ పంచాయతీ సిబ్బందిచే చల్లిస్తున్నాడు. వైకుంఠధామంలో ప్రభుత్వ నిధులతో పాటు దాతల సహకారంతో కనీవిని ఎరగని రీతిలో నిర్మాణ పనులు పూర్తి చేశాడు. ఇంతటితో ఆగకుండా సర్పంచ్ సైదా నాయక్ సొంత ఖర్చులతో కుమారుల జ్ఞాపకార్థం అంతిమయాత్ర వాహనంను ఏర్పాటు చేశారు. అదేవిధంగా దాతల సహకారంతో ఫ్రీజర్ బాక్స్ సమకూర్చారు. రెండింటిని గ్రామ ప్రజలకు ఉచితంగా అందించారు. ఆరు విడతల హరితాహారంలో భాగంగా గ్రామంలో పచ్చదనం వెల్లివిరిసేలా మొక్కలను నాటించారు. మండల కేంద్రంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలలో మొక్కలను నాటించి వాటి సంరక్షించేందుకు పాటు పడుతున్నారు.
ప్రజల ఆరోగ్యం, గ్రామాభివద్దే నా ధ్యేయం :-సర్పంచ్ సైదా నాయక్
గత రెండు సంవత్సరాల కాలంలో పలు అభివృద్ధి పనులు చేపట్టి జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్ ద్వారా ఉత్తమ పంచాయతీ సర్పంచ్‌గా అవార్డు అందుకున్నాను అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే అభివృద్ధి పధకాలను అనతికాలంలోనే పూర్తి చేయడం ద్వారా బోనకల్ గ్రామపంచాయతీ అగ్రగామిగా నిలచిందన్నారు. గ్రామం రూపురేఖలు మారాయన్నారు. బోనకల్ గ్రామ అభివృద్ధి, సంక్షేమం కోసం మరింత పాటు పడతాన న్నారు. గ్రామాభివృద్ధికి తోడ్పాటునందిస్తున్న పంచాయతీ పాలకవర్గానికి, అధికారులకి, గ్రామ ప్రజలకు, దాతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.