Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
- 97 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేత
నవతెలంగాణ- సత్తుపల్లి
కులాల ప్రస్తావనతో పనిలేకుండా కేవలం పేదరికమే గీటురాయిగా గొప్ప మనసుతో పెండ్లి చేసుకున్న పేదింటి ఆడపడుచులకు ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దన్నగా రూ. 1.00116లు కానుకగా ప్రభుత్వం తరపున సాయం అందిస్తున్నారని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య స్పష్టం చేశారు. బుధవారం స్థానిక క్యాంపు కార్యాలయంలలో 97 మంది లబ్ధిదారులకు రూ. 97,11,252 లక్షల విలువగల చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ ఈ విడతలో నియోజకవర్గ వ్యాప్తంగా 416 మంది లబ్ధిదారులకు పథకం మంజూరు చేశారన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మెన్ కూసంపూడి మహేశ్, ఎంపీపీ దొడ్డా హైమవతి శంకరరావు, ఆర్డీవో సూర్యనారాయణ, తహసీల్దారు కేవీఎంఏ మీనన్, వైస్ ఛైర్మెన్ తోట సుజలారాణి, నాయకులు గాదె సత్యనారాయణ, దొడ్డా శంకరరావు, డీసీసీబీ డైరెక్టర్ చల్లగుండ్ల కృష్ణయ్య, కౌన్సిలర్లు ఎస్కే చాంద్‌పాషా, మట్టా ప్రసాద్, అమరవరపు విజయనిర్మల కృష్ణారావు, అద్దంకి అనిల్‌కుమార్, వేములపల్లి మధు, ఎండీ అబ్దుల్లా, గుంట్రు రాఘవేంద్ర, నడ్డి జమలమ్మ ఆనందరావు, కంటె అప్పారావు, మల్లూరు అంకమరాజు, ఆర్ఐలు విజయభాస్కర్, దూపకుంట్ల జగదీశ్‌కుమార్ పాల్గొన్నారు.