Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ- బోనకల్
ప్రేమ అంటూ వెంట పడ్డాడు... పెళ్లి చేసుకుంటానని నాలుగు సంవత్సరాల పాటు ఆమెతో తిరిగాడు.. ప్రస్తుతం పెళ్ళికి నిరాకరించాడు. దీంతో ప్రియురాలు ప్రియుడి ఇంటి ముందు దీక్షకు దిగింది. ఈ సంఘటన మండల పరిధిలోని రావినూతల గ్రామంలో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని చిరునోముల గ్రామానికి చెందిన 21 సంవత్సరాల పారా సింధు రావినూతల గ్రామానికి చెందిన వేణు 2017 నుంచి ప్రేమించుకుంటున్నారు. 2017 లో బోనకల్లు గ్రామం లో దసరా మహౌత్సవాలు సందర్భంగా ఆ విద్యార్థిని కోలాటం వేయటానికి వచ్చింది. సమయంలో వేణు ఆమె వెంట పడ్డాడు. నెల రోజుల పాటు ఆమె ఇంటి చుట్టూ తిరిగి ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుంటానని యువతని నమ్మించాడు. దీంతో యువత కూడా వేణు మాయ మాటలు నమ్మింది. ఇదే అదునుగా భావించిన వేణు నాలుగేళ్లపాటు తమ బంధువులు గ్రామాలైన నల్లగొండ, వరంగల్, ఖమ్మం ప్రాంతాలకు తిప్పాడు. ఖమ్మంలో ఓ లాడ్జిలో కూడా రోజుల తరబడి కలిసి ఉన్నారు. 20 రోజుల క్రితం కూడా వరంగల్ లోని తన మేనమామ ఇంటి వద్ద 20 రోజులపాటు కలిసి ఉన్నామని తెలిపింది. సంవత్సరం క్రితం వేణు తన ప్రియురాలిని ఇంటికి కూడా తీసుకెళ్లాడు. ఆ సమయంలో వేణు తల్లిదండ్రులు ఆమె ను గురించి అడగగా తాను ఆ అమ్మాయిని ప్రేమించానని పెళ్లి చేసుకుంటానని తల్లిదండ్రులకు స్పష్టం చేశాడు. తాను ప్రస్తుతం గర్భవతి అని కూడా వేణు తల్లిదండ్రులకి ఆ యువతి చెప్పింది. ఇలా నాలుగు సంవత్సరాల పాటు ఆ యువతితో తిరిగి నేడు పెళ్ళికి నిరాకరిస్తున్నాడు. దీంతో బాధితురాలు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. నాలుగు రోజులపాటు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగింది. గురువారం వేణుని స్థానిక పోలీస్ స్టేషన్ కు పిలిపించారు. తాను పెళ్లి చేయలేనని ఎస్సై తనతో చెప్పారని దీంతో మరో మార్గం లేక ప్రియుడి ఇంటి ముందు దీక్షకు దిగినట్లు ఆమె తెలిపింది.
మరలా పోలీస్ స్టేషన్ కు....
వేణు ప్రేమించి పెళ్లికి నిరాకరించడంతో ప్రియురాలు ప్రియుడి ఇంటి ముందు దీక్షకు దిగింది. దీంతో ఎస్ ఐ బి కొండలరావు విషయం తెలుసుకొని స్పందించారు. సంఘటనా స్థలానికి పోలీస్ సిబ్బందిని పంపించి ఆమెతో ఎస్ఐ ఫోన్ లో మాట్లాడారు. పోలీస్ స్టేషన్ కి రావాలని న్యాయం చేస్తానని ఆ యువతికి ఎస్ ఐ హామీ ఇచ్చారు. దీంతో ఆమె పోలీస్ స్టేషన్ కి వెళ్ళటానికి అంగీకరించింది. ఆమెను , ప్రియుడి తల్లి ని పోలీసు వాహనంలో రాత్రి 8 గంటల సమయంలో పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు.