Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చైర్మెన్‌గా భూక్యా రాంబాబు, వైస్ చైర్మెన్ వజ్జ రాజు
నవతెలంగాణ-కొత్తగూడెం
కొత్తగూడెం మార్కెట్ కమిటీ నూతన కమిటీ ఎన్నిక జరిగింది. చైర్మన్‌గా భూక్యా రాంబా బు, వైస్ చైర్మన్ వజ్జ రాజు, పలువురు డైరెక్టర్లల ప్రమాణ స్వీకారం గురువారం జరిగింది. లక్ష్మీదేవిపల్లిలోని మార్కెట్ యార్డులో జరిగిన కార్యక్రమంలో మార్కె ట్ కార్యదర్శి కొత్త కమిటీతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం జరిగిన సభలో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వ రరావు మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు దళారీల నుండి కాపాడడానికి కోసమే రైతు మార్కెట్‌ను ఏర్పాటు చేసిందని తెలిపారు. రైతు బాగుంటేనే దేశం బాగుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావు, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వా ల శ్రీనివాసరావు, లక్ష్మీదేవి పల్లి ఎంపీపీ భూక్యా సోనా, చుంచుపల్లి ఎంపీపీ బాదావత్ శాంతి, సుజాతనగర్ ఎంపీపీ భూక్యా విజయలక్ష్మి, ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య, కొత్తగూడెం సొసైటీ చైర్మన్ మండే హనుమంతరావు, వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖ అధికారులు, రైతులు, ప్రజలు పాల్గొన్నారు.
తుంగలో తొక్కిన నిబంధనలు...
కొత్తగూడెం మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం సందర్భంగా జరిగిన కార్యక్రమాలు కోవిడ్-19 నిబంధనలు తుంగలో తొక్కారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే కోవిడ్ వ్యాప్తి వలన భౌతిక దూరం పాటించాలని నిబంధనలు ఉన్నప్పటికీ పెద్ద ఎత్తున గుమిగూడి, ప్రదర్శనలు, డీజేలు ఏర్పాటు చేయడం, మాస్క్‌లు ధరించక పోవడంతో పలు రాజకీయ పార్టీల నాయకులు ఆగ్రహ వ్యక్తం చేస్తున్నారు. కోవిడ్ నిబంధనలు ఇతరులకు చెప్పే పోలీసులు ఈ ప్రదర్శనలకు అనుమతులు ఎలా ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా అనుమతులు లేకుండా భారీగా ప్లెక్సీ బోర్డులు ఏర్పాటు చేశారు. ఇటీల పట్టణ సుందరీకరణలో భాగంగా కలెక్టర్ ఆదేశాల మేరకు మున్సిపల్ పరిధిలో రోడ్డుకిరువైపుల ఉన్న భారీ ఓర్డింగ్లను యంత్రాలతో తొలగించిన అధికారులు కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్చేసి వీటికి ఎలా అనుమతులు ఇచ్చారని ఓర్డింగ్ యజమానులు ప్రశ్నిస్తున్నారు.