Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మణుగూరు
పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాద్యత అని, హరితహారం మానవాళికి రక్షణ కవచంలా మారుతుందని ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. గురువారం అన్నారం పరిధిలోని బెస్తాగూడెంలో హరితహారంలో భాగంగా ఆయన పాల్గొని మొక్కలను నాటారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా కలెక్టర్ అనుదీప్ పాల్గొన్నారు. నూతన కలెక్టర్‌కి పూలమాల అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఇంటింటికీ నీరందించే కార్యక్రమంలో భాగంగా భూమిపూజ నిర్వహించారు. అనంతరం రేగా కాంతారావు మాట్లాడుతూ... ప్రపంచ మానవాళిని వణికిస్తున్న కరోనా లాంటి ఉపధృవాలు రాకుండా వుండాలంటే అడవులు సంవృద్ధిగా వుండాలన్నారు. ప్రతి పౌరుడు మొక్కలు నాటి పర్యావరణం పరిరక్షణ అందరి బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నాగప్రసాద్, తహసీల్దార్ చంద్రశేఖర్, జెడ్పీటీసీ పోశం నర్సింహారావు, ఎంపీపీ కారం విజయకుమారి, పీఏసిఎస్ చైర్మన్ కుర్రి నాగేశ్వరావు, మండల, పట్టణ అధ్యక్షులు ముత్యంబాబు, అడపా అప్పారావు, వర్కింగ్ ప్రెసిడెంట్ నవీన్‌కుమార్, అధికారులు, టీఆర్‌ఎస్‌నాయకులు పాల్గొన్నారు.