Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతులకు ఘన సన్మానం
నవతెలంగాణ-భద్రాచలం
రైతే రాజు గ్రామ స్వరాజ్యమే ధ్యేయం అనే లక్ష్యంతో దేశానికి వెన్నెముక అయిన రైతుని పూజించే గొప్ప నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన జేడీ ఫౌండేషన్ సేవలు అభినందనీయమని ఏఎస్పీ జి.వినీత్ అన్నారు. పట్టణంలోని కూనవరం రోడ్లో గల ఒక కౌలు రైతు పొలం నందు జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కౌలు రైతులకు సన్మానం అనే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఎస్పీ పాల్గొని మాట్లాడారు. అన్నదాత అయిన రైతులు కూడా రైతు పూజోత్సవం పేరుతో పూజించటం నిజంగా సంతో షం కలిగించిందని తెలిపారు. ఈ మేరకు భద్రా చలం, పురుషోత్తపట్నం, నెల్లిపాక, కొల్లుగూడెం, ఏళ్ల బయ్యారంలోని ఎంపిక చేసిన 9 మంది కౌలు రైతు లను (ఇద్దరు మహిళ రైతులకు) ఘనంగా సన్మానిం చారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని జెడీ ఫౌండేషన్, భద్రాచలం బాధ్యులు మురళీ మోహన్ కుమార్ మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా ఈ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 31 జిల్లాలో ఎంపిక చేసిన చిన్న సన్నకారు, కౌలు రైతులను సన్మాని స్తున్నట్టు తెలిపారు. నూతనంగా ఈసారి పొలంలోనే రైతుల మధ్య సన్మానం నిర్వహించడం ఆనందక రంగా ఉందని, అలాగే రైతులను సన్మానించడంలో ప్రత్యేకంగా వారికి ప్రశంసాపత్రాన్ని అందించడం మరిచిపోలేని అనుభూతిని కలిగించిందని ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి కంభంపాటి సురేష్ కుమార్ తెలిపారు.
'రైతుకు చేయూత' నూతన పథకం ప్రారంభం
కౌలు రైతులు వ్యవసాయం చేయడానికి తగినంత ఆర్థిక పరిపుష్టి లేక అప్పుల పాలయి ఇబ్బందులు పడుతున్న రైతులను ఆదుకునే లక్ష్యంతో ప్రప్రథమంగా జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతు చేయూత అనే పేరుతో ఎంపిక చేసిన 3 రైతులకు (అమరజ్యోతి, మణి, మద్దినేని వెంకటేశ్వర రావు)లకు రూ.11 వేల చొప్పున పెట్టుబడి సాయాన్ని విరాళంగా అందజేశారు. ఈ విరాళాలను ఫౌండేషన్ సభ్యులతో పాటు ప్రవాస భారతీయులు ఆకునూరి రమణ రావు అందజేసినట్టు మురళి మోహన్ కుమార్ తెలిపారు. ఈ విరాళాన్ని తిరిగి రైతు పంట పండించిన తర్వాత యధావిధిగా ఫౌండేషన్‌కు అందజేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు హన్సి, పవన్ కుమార్, కడాలి నాగరాజు, ఉప్పాడ రాంప్రసాద్ రెడ్డి, యూసఫ్ మియా, సన్మానం పొందిన రైతులు దారపునేని చెన్నయ్య, ఇంటూరి లింగయ్య, బురేం అప్పారావు, భాష్యం బుచ్చయ్య, చుంచు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.