Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రసూతి వైద్యశాలకు వైద్యులను నియమించాలి
- పట్టాలున్న గిరిజన పోడు భూములను లాక్కో వద్దు
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా
నవతెలంగాణ-చర్ల
మండల కేంద్రంలో ఉన్న వైద్య సమస్యలు పాలకులకు, ప్రజాప్రతినిధులకు పట్టవా అని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు సూటిగా ప్రశ్నించారు. గురువారం మండల కేంద్రంలో కామ్రేడ్ బీఎస్ రామయ్య భవన్లో పార్టీ మండల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన ఆయన మాట్లాడారు. మండలంలోని ప్రసూతి వైద్యశాలకు తక్షణం వైద్యులను నియమించాలని, పెరిగిన జనాభా ప్రాతిపదికన మండల కేంద్రంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నియమించి సీహెచ్సీ తరహా వైద్యం ప్రజలకు అందించాలన్నారు. కనీసం పీహెచ్సీ వైద్య సౌకర్యం కూడా మండల కేంద్రంలో లేకపోవడంవల్ల మండల కేంద్రంలో ఉన్నటువంటి ఆసుపత్రికి వచ్చే 8 గ్రామ పంచాయతీల ప్రజలు వైద్యానికి దూరమవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్న ప్రసూతి హాస్పిటల్లో కూడా నలుగురు డాక్టర్లకు బదులుగా ఒక్క డాక్టరు కూడా లేడని, పదిమంది నర్సులకు కేవలం ఇద్దరు నర్సులు మాత్రమే ఉన్నారని, ఈ విధంగా వైద్యులు లేకుండా ప్రజలకు వైద్యం ఎలా చేస్తారని ప్రశ్నించారు. మండలంలోని పోస్టుమార్టం నిర్వహణ నిర్వహిం చాలని కోరారు.
పట్టాలు ఉన్న గిరిజన కోడు భూములను అధికారులు లాక్కోవాలని చూ స్తున్నారని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన అన్నారు. తక్షణం ఆ గిరిజనులకు ఇచ్చిన భూమిని ఆ గిరిజనులకు ఇవ్వాలని కోరారు. గిరిజనుల భూ ముల్లో అక్రమంగా కడుతున్న కట్టడాలను నిలిపివేసి వారి భూములిని వారికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆ గ్రామంలోని గిరిజనులు మొత్తాన్ని పోగేసి ప్రజా పోరాటం నిర్వహిస్తామని హెచ్చ రించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కోలగాని బ్రహ్మచారి, పార్టీ మండల కార్యదర్శి కారం నరేష్, పార్టీ మండల నాయకులు అలవాల రాజమ్మ, కొండ చరణ్, బోల్ల వినోద్, చింతూరు రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు.