Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నల్లజెండాలు, ప్లకార్జులతో పెట్రోల్ బంక్ ఎదుట నినాదాలు
- సామాన్యుడిపై భారం మోపుతున్న కేంద్రం
- వామపక్ష నేతలు కూనంనేని, కనకయ్య
నవతెలంగాణ-కొత్తగూడెం
పెట్రో ధరలను పెంచుతూ సామాన్య ప్రజలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా భారం మోపుతున్న కేంద్ర సర్కార్ విధానాలను నిరసిస్తూ వామపక్ష పార్టీలైన సీపీఐ(ఎం), సీపీఐ, సీపీఐ (ఎంఎల్ న్యూడెమోక్రసీ) పార్టీల ఆధ్వర్యంలో గురువారం పోస్టాఫీస్, పెట్రోల్ బంక్‌ను ముట్టడించి పెద్దఎత్తున నిరసన ధర్నా చేశారు. నల్లజెండాలు, ప్లకార్డులు ప్రదర్శిస్తూ కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ నినాదాలు చేశారు. ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య మాట్లాడారు. రెండో దఫా అధికారం చేపట్టిన తర్వాత కేంద్రంలోని బీజేపీ పెట్రో ధరలను పెంచుతూ ప్రజలపై భారం మోపుతున్నారని విమర్శించారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్యుడు కనీసం ఒక్కపూట తిండితినలేని దుస్థితికి నెట్టివేయబడ్డాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడేళ్ళ క్రితం నాటికి పోల్చుకుంటే క్రూడాయిల్ ధర 30శాతం తగ్గినప్పటికీ ధరలు తగ్గించకుండా భారం మోపుతున్నారన్నారు. పెట్రో ధరల పెరుగుదల ప్రత్యక్షంగా రవాణా రంగంపై ప్రభావం చూపిస్తుందన్నారు. పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తేకుండా కేంద్రం చేసిన కుట్రలకు టీఆర్ఎస్ ప్రభుత్వం సహకరించిందని ఆరోపించారు. తక్షణమే ఇందన ధరలను తగ్గించేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో ఆందోళనలు తీవ్రరూపం దాలుస్తాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎన్‌కె.సాబీర్ పాషా, న్యూడెమోక్రసీ పట్టణ కార్యదర్శి కందగట్ల సురేందర్, డివిజన్ నాయకులు పి.సతీష్ మాట్లాడారు. నిసరన ధర్నాలో సీపీఐ(ఎం) జిల్లా నాయకులు జాటోత్ కృష్ణ, భూక్య రమేష్, లిక్కి బాలరాజు, సందకూరి లక్ష్మి, నందిపాటి రమేష్, నాగేశ్వర్రావు, బిక్కులాల్, కెహెచ్.ప్రసాద్, చంటి, రవి, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు గుత్తుల సత్యనారాయణ, వై.శ్రీనివాసరెడ్డి, జిల్లా సమితి సభ్యులు జి.వీరస్వామి, పిట్టల రాంచందర్, జె.గట్టయ్య, ఎస్.సుధాకర్, కె.రత్నకుమారి, సర్పంచ్ పద్మ, ఇఫ్లూ జిల్లా నాయకులు ఎన్.సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.
భద్రాచలం : కేంద్ర ప్రభుత్వం ప్రజలపై బారాలు మోపే విధానాన్ని నిరసిస్తూ పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో దేశవ్యాప్త నిరసన పిలుపులో భాగంగా గురువారం భద్రాచలం ఉదయ భాస్కర్ థియేటర్ ఎదురుగా ఉన్న పెట్రోల్ బంక్ ముందు సీపీఐ(ఎం), సీపీఐ, ఎన్డీ నాయకులు, కార్యకర్తలు నిరసన కార్యక్రమాన్ని చేప ట్టారు. ఈ కార్యక్రమానికి సీపీఐ పట్టణ కార్యదర్శి సునీల్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వామపక్ష పార్టీ నాయకులు, సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు ఎం.బి.నర్సారెడ్డి, ఎన్డీ రాష్ట్ర నాయకులు కెచ్చెలరంగారెడ్డి, సీపీఐ కార్యదర్శి ఏ.సునీల్‌లు మాట్లాడారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రజలపై భారాలు మోపుతున్నదని పేర్కొన్నారు. అధాని, అంబానీ లాంటికార్పొరేట్ శక్తులకు మోడీ ప్రభుత్వం మద్దతుగా ఉందన్నారు. ఈ నెల 26వ తేదీన రైతులకు వ్యతిరేకంగా తెచ్చిన మూడు నల్లచట్టాలను రద్దు చేయాలని రైతు సంఘాలు ఇచ్చిన పిలుపు జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు పి.సంతోష్ యన్.నాగరాజు, యన్. లీలావతి, డి.లక్ష్మి, ప్రవీణ్, కె.రవి పాల్గొన్నారు. సీపీఐ ఖాదర్, ఎమ్మార్పీఎస్ నాయకులు అలవాల రాజా, వారి సభ్యులు సంఘీభావం తెలిపారు.