Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమరయ్య ఆశయ సాధనకు నేటి యువత కృషి చేయాలి
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు
నవ తెలంగాణ-ఖమ్మంరూరల్
ఆదర్శ దంపతులు కోటి అమరయ్య-అచ్చమ్మలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు అన్నారు. మండలంలోని పొన్నెకల్లు గ్రామంలో సిపిఎం సీనియర్ నాయకులు కోటి అమరయ్య-అచ్చమ్మల దశ దినకర్మ గురువారం నిర్వహిం చారు. ఈ సందర్భంగా పోతినేని మాట్లా డుతూ పొన్నెకల్లు గ్రామంలో పార్టీ అభివృద్ధికి ఎనలేని కృషి చేసిన వ్యక్తి కోటి అమరయ్య అన్నారు. అమరయ్య కష్టసుఖాల్లో పాలుపంచు కుని గ్రామంలోని పార్టీ కార్యకర్తలకు తల్లిలా అండగా ఉన్న వ్యక్తి అచ్చమ్మ అన్నారు. కోవిడ్ బారిన పడి పది రోజుల వ్యవధిలో ఒకేసారి అమరయ్య-అచ్చమ్మలు మరణించడం వారి కుటుంబానికి, పొన్నెకల్లు సీపీఎం పార్టీకి తీరని లోటన్నారు. వారి ఆశయ సాధన కొరకు గ్రామంలోని యువత కృషి చేయాలని కోరారు. అమరయ్య కుటుంబానికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండి రమేష్, తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మాదినేని రమేష్, ఐద్వా రాష్ట్ర నాయకురాలు బుగ్గవీటి సరళ, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బండి పద్మ, మాచర్ల భారతి, సీపీఎం సీనియర్ నాయకులు రాయల వెంకటేశ్వర్లు, బత్తినేని వెంకటేశ్వర రావు, సిద్దినేని కోటయ్య, మండల కార్యదర్శి నండ్ర ప్రసాద్, మండల నాయకులు తమ్మినేని కోటేశ్వరరావు, పొన్నెకంటి సంగయ్య, పి.మోహన్‌రావు, ప్రసాద్‌రావు పాల్గొన్నారు.