Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం
కాంగ్రెస్ పార్టీ నాయకులపైనా, కార్యకర్తలపైనా అక్రమ కేసులు బనాయించటం దుర్మార్గమనికాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావులు అన్నారు. గురువారం ఖమ్మంలోని సంజీవరెడ్డడి భవన్లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ నగరంలో కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసిన అభ్యర్థులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, సర్పంచ్‌లపై అన్ని రకాలుగా మంత్రి ఆదేశాల మేరకు పోలీసులు అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి చేరితే కేసుల ఉండవని, భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్తున్నారన్నారు. మీరు చేరుతారా లేకుంటే అక్రమ కేసులు పెట్టమంటారా అని ప్రతి రోజు కార్యకర్తలపై దాడులకు పాల్పడటంతో పాటు గెలిచిన కార్పొరేటర్ల మీద ప్రభుత్వ రాక్షసంగా వ్యవరిస్తుందన్నారు. ఇప్పటికైనా దాడులు మానుకొని అభివృద్ధికి పాటుపడాలన్నారు. పీడి యాక్ట్ లు సైతం నమోదు చేస్తున్నారని, కొద్ది మంది పోలీసులు వారికి ఇష్టం వచ్చినట్లు కేసులు నమోదు చేస్తున్నారన్నారు. 54వ డివిజన్ కార్పొరేటర్ మిక్కిలినేని మంజుల మాట్లాడుతూ తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్న సమయంలో సైతం తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. తమపై జరుగుతున్న సంఘటనపై ప్రత్యర్థులపై పోలీసులకు వివరించగా కేసు నమోదు చేస్తామని చెప్పి.... చివరకు తమపై కేసు నమోదు చేశారని ఆరోపించారు. ప్రతిపక్షం ఉండకుండా ఉండాలనే విధానం సరికాదన్నారు. విలేకరుల సమావేశంలో పార్టీ నగర అధ్యక్షులు ఎండి జావీద్, నాయకులు వడ్డెబోయిన నర్సింహరావు, మొక్కా శేఖర్డ్, లక్ష్మణ్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.